కూకట్ పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిలుగా మేడ్చల్ జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ.. నీళ్ళు,నిధులు, నియామకాలు అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు.
Also Read : WTC 2023 : డబ్య్లూటీసీ ఫైనల్ కు శార్దూల్ కు ఛాన్స్.. సూర్యకు నో ప్లేస్
పోరాటంతో రాష్ట్రాన్ని దేశంలో సాధించి అభివృధిలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలుపారు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్ పల్లి నియోజక వర్గంను మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో వేల కోట్ల రూపాయల నిధులతో అభివృధి చేశామని వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి పేద ప్రజలకు పెద్దన్నగా నిలిచారు సీఎం కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం బీఆర్ఎస్ సాధిస్తుంది ఎమ్మెల్యే కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Harish Rao: బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతోంది..