హై కోర్టు , సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లను కోరుతున్నా… నిన్న బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టులో జరిగిన పరిణామాలను తెలుసుకోవాలని అన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అడ్వకేట్ లు నిన్న న్యాయ వ్యవస్థ పై దాడి చేశారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. బీజేపీ లాయర్లు వద్దని అన్న… కోర్టులో అబద్ధం చెప్పారు బండి సంజయ్ అని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Man shoots girlfriend: పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిని కాల్చి చంపి ఆపై!
బండి సంజయ్ జైలు నుంచి వచ్చిన తర్వాత నా ఫోన్ తో ఏమి పని అంటున్నాడని, పోలీసులను బెదిరిస్తున్నారు బండి సంజయ్ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. వాళ్ళ లాయర్లు కూడా అదే రకంగా మాట్లాడతారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రఘునందన్ ఉన్నతాధికారులను బూతులు తిడుతున్నారని, ఆ హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారు ? అని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ పేపర్ లీకేజీ కుట్రలో ఏ1 అని, అవసరం అయినప్పుడల్లా జడ్జీలను బీజేపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయన్నారు.
Also Read : Pocharam Srinivas Reddy : కొత్త బిచ్చగాళ్లకు కేసీఅర్‌ను ఎదుర్కొనే దమ్ము లేదు