Telangana Assembly: శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ప్రవేశపెట్టారు. విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరుగలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఐఐటీ, గిరిజన యూనివర్సిటీ ఊసేలేదని మండిపడ్డారు. విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అదానికి కట్టబెట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ సంపద సృష్టిస్తుంటే.. కేంద్రం మాత్రం ఉన్న సంపదను అమ్మేస్తోందని అన్నారు.
Read also: Fire Accident: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు.. రామాంతపూర్ ఫర్నీచర్ గోడౌన్‌లో..
ఎల్‌ఐసీని అదాని కాళ్లదగ్గర పెట్టారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు అధిక వేతనాలు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యాలు దేశం మొత్తం విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో ఉపాధి రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. ఐటీ రంగంలో 2 లక్షల 55 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దాదాపు 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఆర్థిక వృద్ధిరేటు 128 శాతం పెరిగిందని తెలిపారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 11 లక్షల 48 వేల కోట్లకు చేరగా… రాష్ట్రంలో తలసరి ఆదాయం 3 లక్షల 17 వేలుగా ఉందని తెలిపారు.
Mulugu Accident: కరెంట్ స్థంభానికి ఢీ కొట్టిన ఆటో.. స్పాట్ లోనే మహిళ మృతి..