మోడీ హైదరాబాద్ పర్యటనలో పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. అయితే.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ట్రైన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో.. బీఆర్‌ఎస్ నేతలు మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. ఇటీవలే సర్వేలలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి ఎక్కువ అని తేలిందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ పెరేడ్ గ్రౌండ్స్ లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట సభ పెట్టారని, ఆ సభను ప్రధాని పూర్తిగా రాజకీయ మయం చేశారని రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : CSK vs MI: విజృంభించిన సీఎస్కే బౌలర్లు.. చెన్నైకి స్వల్ప లక్ష్యం
గవర్నర్ సభా వేదిక పైన ఉన్నారు.. బీజేపీ కండువాలు వేసుకున్న నేతలు ఎక్కువమంది ఉన్నారని, మోడీ సభలో గతంలో చెప్పిందే చెప్పారు.. కొత్తగా చెప్పిందేమి లేదని ఆయన మండిపడ్డారు. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా కేంద్రం ఈ తొమిదేళ్లలో కేటాయించలేదని ఆయన ధ్వజమెత్తారు. మేమేదో రేషన్ కార్డులు దాచుకున్నట్టు మోడీ అబద్దామాడారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చేది తక్కువ.. రాష్ట్రం ఇచ్చింది ఎక్కువ అని, ప్రధాని ఇంత పచ్చిగా అబద్దాలు మాట్లాడొచ్చా? అని ఆయన ప్రశ్నించారు. నగదు బదిలీ పథకంపై కూడా ప్రధాని అబద్దాలు మాట్లాడారని, మోడీకి ఇవే చివరి ఎన్నికలు.. బీజేపీ మరో మారు అధికారం లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన వ్యాఖ్యానించారు. అన్నీ వ్యవస్థలను మోడీ బెదిరిస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.
Also Read : Jammu And Kashmir: కేంద్రమంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు… తృటిలో తప్పించుకున్న కిరణ్ రిజిజు