Palla Rajeshwar Reddy: రేవంత్ రెడ్డికి పల్లా సవాల్.. వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించు చూద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Rajeshwar Reddy: శాసన మండలి మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో ప్రగతిభవన్ ను పేల్చివేయాలని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు అందరూ కలిసి డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పీడీ యాక్ట్ పెట్టాలని కోరుతామన్నారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తామన్నారు. ములుగు జిల్లాలో అభివృద్ధి పనుల పై కూడా తప్పుగా మాట్లాడారని మండిపడ్డారు. ములుగు జిల్లాను సీఎం కేసీఆర్ ఏర్పాటుచేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ పై కూడా వ్యాఖ్యలు చేశారు. వర్సిటీకి సంబంధించిన భూమిని సేకరించడం జరిగిందని తెలిపారు. వర్సిటీపై పార్లమెంట్ లో మాట్లాడాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉందని ఎద్దేవ చేశారు. వర్సిటీ భూమి, భవనాలు వివరాలు ఇస్తాం.. వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించు అంటూ సవాల్ విసిరారు. సీనియర్లను కాదని ఒక బ్లాక్ మెయిలర్ ను పీసీసీ అధ్యక్షుడుగా పెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Bhatti Vikramarka: టాక్స్ రెవెన్యూ 40 వేలకోట్లా!.. టాక్స్ వేశారా? వేయాలని ఆలోచిస్తున్నారా?
Also Read
ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేయాలని నిన్నటి పాదయాత్రలో టీపీసీసీ రేవంత్ రెడ్డి మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో దొరల గడిలను కూల్చివేసిన మావోయిస్టులు ప్రగతి భవన్ కూడా కూల్చివేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఉంటే ఏంది, లేకుంటే ఏంది… అందుకే మావోయిస్టులు డైనమేట్లు పెట్టి ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రేవంత్ రెడ్డి నిన్న ములుగులో చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మీద పీడీ యాక్ట్ నమోదుచేయాలని ములుగు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు పిర్యాదు చేసారు. రేవంత్ రెడ్డి యాత్రను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనితో రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి యాత్రపై ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే ములుగు పోలీసు స్టేషన్ లో రేవంత్ రెడ్డి కామెంట్స్ పైనా బీఆర్‌ఎస్ శ్రేణులు పిర్యాదు చేయగా ఇక నర్సంపేట్ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు రెడీ అయ్యారు.
MLA’s Purchase: ఎమ్మెల్యేల ఎర కేసు.. 17న విచారిస్తామన్న సుప్రీం కోర్టు
తాజావార్తలు
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!