Muthireddy Yadagiri Reddy: జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న తరుణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. ఈసారి కూడా తనకే అవకాశం ఇవ్వమంటూ సీఎంను ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వేడుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో కాంగ్రెస్, బీజేపీలకు జనగామలో స్థానం లేకుండా చేశానన్న ఆయన.. మొదటి లిస్టులోనే జనగామ టికెట్ ప్రకటించాలని సీఎంను కోరుకుంటున్నామన్నారు.
Read Also: African Swine Flu: కేరళలో స్వైన్‌ఫ్లూ కలకలం.. పందులను చంపాలని ఆదేశం
ఈ సారి తనకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించాలని వేడుకుంటున్నామని, మూడుసార్లు ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించానని, ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ సీఎంను వేడుకున్నారు. బీఆర్‌ఎస్ జనగామలో బలంగా ఉందన్నారు. తన కుటుంబంలో చిచ్చుపెట్టింది పల్లా రాజేశ్వర్ రెడ్డే అని విరుచుకుపడ్డారు. తన కూతురిని రోడ్డుపైకి తెచ్చింది పల్లానే అని ఆరోపించారు. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. కొమ్మూరి కొడుకు తన కూతురు భర్త ఇద్దరూ క్లాస్‌మేట్స్ అని చెప్పుకొచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రలు జనగామలో సాగవని స్పష్టం చేశారు. పల్లా ఎంత ఎత్తుగా ఉంటాడో అంత ఎత్తులో కుట్రలు చేస్తారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను డబ్బులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లిందన్నారు.
Read Also: Viral Video : ముసలోడే కానీ గట్టొడే.. బైక్‌పై అద్భుత స్టంట్స్ చేస్తూ..
పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా జనగామకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి డిమాండ్ చేశారు. జనగామను హుజూరాబాద్ అంత ఖరైదైన ఎన్నికగా మార్చేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారన్నారు. పల్లా అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారని తెలిపారు. పార్టీకి తప్పుడు రిపోర్టులు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. సీఎం టికెట్ ప్రకటించకుండానే టికెట్ ఇచ్చారని ఎలా చెబుతున్నారంటూ ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపుకు సహకరించిన జనగామకు ఏడేళ్లలో ఏ గ్రామానికైనా నిధులు ఇచ్చావా.. చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తనకు టికెట్ కేటాయించాలని ముత్తిరెడ్డి సీఎంను కోరారు.