India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.
Pakistan: శుక్రవారం రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై విషం వెళ్లగక్కాడు. ఐక్యరాజ్యసమితి వేదికగా అన్ని అబద్ధాలనే ప్రచారం చేశాడు. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంపై తామే గెలిచామంటూ, భారతదేశాన్ని శత్రువుగా అభివర్ణించాడు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడిపై నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు కోసం తాను విజ్ఞప్తి చేశానని, కానీ భారతదేశం ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఈ విషాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించాడు.
దాయాది దేశం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ వేదికగా భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని.. సొంత ప్రజలనే బాంబులతో చంపేస్తోందని భారత్ విమర్శించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి ప్రసగించారు.
ఆపరేషన్ సిందూర్-2, 3 భాగాలు అనేది పాకిస్థాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. మొరాకోలోని భారతీయ సమాజంతో జరిగిన సంభాషణలో రాజ్‌నాథ్‌సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆసియా కప్ 2025లో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమిని ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత కరచాలనం వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీపై ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం పీసీబీ ఫిర్యాదును పక్కనపెట్టింది. సూపర్-4లో ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. చిరకాల…
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు పడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన భారత్.. మరోసారి జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఒకవేళ అనివార్య కారణాల చేత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దుబాయ్‌లో…
Pakistan: పాకిస్తాన్ తన సొంత ప్రజల్ని మాయం చేస్తోంది. బలూచిస్తాన్‌లో తమ హక్కుల గురించి నినదించిన వారు క్రమంగా ‘‘అదృశ్యం’’ అవుతున్నారు. వారు ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. తమ వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం తెలియక అక్కడి కుటుంబాలు అల్లాడిపోతున్నాయి.
పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించాలనేది ఈ ఒప్పందం యొక్క సారాంశం. అప్పుడు రెండు దేశాలు కలిసి శుత్రువుపై దాడికి దిగాలని ఒప్పందం సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నట్లుగా ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
Turkey: శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతను భారతదేశం పాటిస్తోంది. అన్ని వేళల్లో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు ఇదే సూత్రాన్ని వర్తింపచేస్తోంది. ఇప్పటికే, అజర్ బైజాన్‌కు వ్యతిరేకంగా ఆర్మేనియాకు పెద్ద ఎత్తున భారత్ ఆయుధాలను అందిస్తోంది. మరోవైపు, టర్కీకి కూడా చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. టర్కీకి అతిపెద్ద శత్రువుగా ఉన్న సైప్రస్ దేశంలో భారత్ తన రక్షణ సంబంధాలను పెంచుకుంటోంది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇక రియాద్‌లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. పరస్పరం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి.