అంతర్జాతీయ వేదికగా భారతదేశంపై నిందలు మోపే ప్రయత్నం చేసిన దాయాది పాకిస్థాన్‌కు భారత దౌత్యవేత్త పర్వతనేని హరీష్ గట్టిగా బుద్ధి చెప్పారు. సొంత ప్రజలను బాంబులతో చంపే దేశం.. తమపై నిందలు వేయడం చాలా విడ్డూరంగా ఉందంటూ తిప్పికొట్టారు.
IND vs PAK: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేసిన దాడులను దాయాది దేశం ఎదుర్కోలేక మన ముందు మోకరిల్లింది. దీంతో అక్కడి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతునే ఉంది.
ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే పాకిస్థాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.
పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం... ఆదివారం సాయంత్రం 06:59 గంటలకు భూకంపం సంభవించింది.
Eknath Shinde: 26/11 ముంబై ఉగ్ర దాడుల తర్వాత, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోకపోవడం ‘‘ద్రోహం’’ అని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే అన్నారు. ఎవరి ఒత్తిడితో కాంగ్రెస్ పాకిస్తాన్‌పై దాడికి సిద్ధ పడలేదని ప్రశ్నించారు. శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే తన సొంత పార్టీ అనుచరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్‌తో మన దళాలు పాకిస్థాన్‌కు రుచిచూపించాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దసరా సందర్భంగా భుజ్‌లో సైనిక దళాలతో కలిసి రాజ్‌నాథ్‌సింగ్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరికలు జారీ చేశారు.
క్వెట్టాలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు క్వెట్టాలో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. తరువాత కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ళు, భవనాల ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్ వార్తల వెబ్సైట్ డాన్ ప్రకారం, ఈ పేలుడులో 10 మంది మరణించారని, 32 మంది గాయపడ్డారని నివేదించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. Also Read:JC Prabhakar…
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ పాక్ పై విజయ దుంధుబి మోగించిన తర్వాత టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్, ఆ దేశ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. దీంతో నఖ్వీ అంతర్జాతీయ వేదికపై అవమానాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు భారత్ క్రీడా స్ఫూర్తిని అవమానించిందని ఆరోపిస్తున్నారు. ఆట తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందన పోస్ట్‌పై మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్లో నఖ్వీ స్పందించారు. మోడీపై…
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫర్హాన్ (57), ఫకార్ జమాన్ (46) రాణించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (69 నాటౌట్), శివమ్ దూబె (33), సంజూ శాంసన్ (24) రాణించడంతో లక్ష్యాన్ని భారత్…
Anant Shastra: పాకిస్తాన్, చైనా సరిహద్ధుల్ని మరింత బలోపేతం చేయడానికి భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో వైమానిక రక్షణ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి భారత సైన్యం ఐదు నుంచి ఆరు రెజిమెంట్ల ‘‘ అనంత శస్త్ర’’ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసింది.