Asim Munir: అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్.. ఈసారి కీలక బాధ్యతలు! దేనికోసమో..!
- అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్
- దళాల అధిపతిగా పదోన్నతి
- ఇప్పటికే ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న మునీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్ దక్కింది. ఆర్మీ చీఫ్‌గా ఉన్న అతడు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ పొందాడు. తాజాగా రక్షణ దళాల అధిపతిగా అసిమ్ మునీర్ ప్రమోషన్ పొందాడు. దేశ తొలి రక్షణ దళాల అధిపతి (CDF)గా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నియామకానికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు. అసిమ్ మునీర్‌ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) రెండింటికీ సిఫార్సు చేస్తూ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేయగా.. దానికి ఆమోదం తెలిపినట్లు పాకిస్థాన్ అధ్యక్ష కార్యాలయం ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది.
ఇది కూడా చదవండి: IndiGo Flights: ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం.. తిండి తిప్పలు లేక ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అసిమ్ మునీర్ 5 ఏళ్ల పాటు రక్షణ దళాల అధిపతిగా కొనసాగుతారు. అలాగే ఏకకాలంలో సీవోఏఎస్‌గా కూడా కొనసాగనున్నారు. కొత్త ఆమోదం మార్చి 19, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఏడాదే మునీర్ ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందాడు. అలాగే ఆర్మీ చీఫ్ పదవిని కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా దళాల అధిపతిగా ప్రమోషన్ లభించింది. 1965లో భారతదేశంతో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌కు నాయకత్వం వహించిన జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ పొందిన దేశ చరిత్రలో రెండో సైనికాధికారి మునీర్ కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Putin: అమెరికా ఇంధనాన్ని కొనుగోలు చేయొచ్చు, ఇండియా చేస్తే తప్పా.?
అయితే అసిమ్ మునీర్‌కు ప్రమోషన్ ఇవ్వడం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ నుంచి బహ్రెయిన్‌కు వెళ్లారు. అక్కడ నుంచి లండన్‌కు చెక్కేశారు. పాకిస్థాన్‌కు దూరంగా ఉంటూ తప్పించుకుని తిరిగారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు సమాచారం. మొత్తానికి తప్పేటట్టు లేకపోవడంతో చాలా రోజుల తర్వాత షెహబాజ్ షరీఫ్ ఆమోదం తెలిపారు.
అసిమ్ మునీర్ రెచ్చగొట్టడం వల్లే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. 26 మంది చనిపోయారు. అనంతరం మే 7న భారతప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతినడంతో పాటు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక అమెరికా పర్యటనకు వెళ్లిన మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. తాజాగా ప్రమోషన్ లభించింది. ఈ సారి ఎలా రెచ్చిపోతాడో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!