ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండో-పాక్ కరచాలన వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తప్పించాలన్న తమ డిమాండ్‌కు ఐసీసీ అంగీకరించకపోవడంతో.. యూఏఈ మ్యాచ్‌ను బహిష్కరించడానికి పాక్ సిద్ధమైంది. హై డ్రామా తర్వాత రిఫరీ ఆండీ తమ జట్టుకు క్షమాపణ చెప్పినట్లు పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే…
ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎ నుంచి సూపర్-4 చేరాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. ఈ విజయంతో పాకిస్థాన్ సూపర్-4కు చేరుకుంది. గ్రూప్-ఎ నుంచి భారత్ ఇప్పటికే సూపర్-4కు చేరుకుంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన యూఏఈ పరాజయం పాలైంది. లేదంటే ఆతిథ్య యూఏఈ సంచలనం సృష్టించేదే. గ్రూప్-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్థాన్, యూఏఈల మధ్య…
Pakistan: ఆసియా కప్ 2025లో అనుకొని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘హ్యాండ్ షేక్’ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు హైడ్రామా చేస్తోంది. నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరగాల్సిన మ్యాచ్ సమయానికి పాకిస్తాన్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రావాల్సి ఉండగా ఆటగాళ్లు అందరూ హోటల్ రూమ్ కే పరిమితమైంది. భారత్ తో జరిగిన మ్యాచ్ లో.. మ్యాచ్ ముగిసిన తర్వాత హ్యాండ్ షేక్ ఇవ్వని కారణంగా పాకిస్థాన్ జట్టు ఈ విధంగా…
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ ఆర్మీపై భీకర దాడులు చేసింది. ముందుగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది.
ఆపరేషన్ సిందూర్ దెబ్బేంటో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు రుచి చూశాయని.. ఈ మేరకు జైషే ఉగ్ర సంస్థ అంగీకరించిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.
BJP: ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్, దాయాది పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లను కనీసం పట్టించుకోలేదు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశ ప్లేయర్లకు ‘‘హ్యాండ్ షేక్’’ కూడా మన ప్లేయర్లు ఇవ్వలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని ‘‘పహల్గామ్’’ బాధితులకు, భారత సైన్యానికి అంకితమిచ్చారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తమకు జరిగిన అవమానానికి తీవ్రంగా రగిలిపోతోంది. ఆ దేశ మాజీ క్రికెటర్లు భారత్‌పై విమర్శలు…
Pakistan: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత వారం పాకిస్తాన్‌లోని బాలాకోట్ తహసీల్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమం ఉగ్రవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్పై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. భారత్ ‘‘అజర్ కుటుంబాన్ని హతమార్చింది’’ని కాశ్మీరీ అంగీకరించారు.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా సెప్టెంబర్ 25న ఇద్దరు పాక్ నాయకులు ట్రంప్‌తో చర్చలు జరుపుతారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
Pakistan: యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 మ్యాచులు జరుగుతున్నాయి. అయితే, ఈ టోర్నీకే హైలెట్‌గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అత్యంత సునాయాసంగా దాయాదిని మట్టికరిపించింది. ఇదిలా ఉంటే, ఈ ఓటమి కన్నా, పాకిస్తాన్ జట్టును, ఆ దేశాన్ని మరో విషయం తెగ బాధ పెడుతోంది. భారత్ జట్టు ఆటగాళ్లు, పాకిస్తాన్ క్రికెటర్లను కనీసం పట్టించుకోలేదు, ‘‘షేక్ హ్యాండ్’’ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే తీవ్ర వివాదాస్పదంగా…
పాకిస్థాన్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ చైల్డ్ టీవీ స్టార్ ఉమర్ షా (15) హఠాన్మరణం చెందాడు. 15 ఏళ్లకే నిండు నూరేళ్ల నిండిపోయాయి. తన సోదరుడు ఉమర్ షా గుండెపోటుతో చనిపోయినట్లుగా సోదరుడు, టిక్‌టాక్ స్టార్ అహ్మద్ షా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు.