Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు భారత్ అపూర్వ స్వాగతం పలికింది. ప్రధాని నరేంద్రమోడీ నేరుగా వెళ్లి ఎయిర్‌పోర్టులో పుతిన్‌ను రిసీవ్ చేసుకున్నారు. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. భారత్-రష్యా మధ్య బంధం మరింత బలపడుతుందని ఇరువురు నేతలు కొనియాడారు. పుతిన్ పర్యటనపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. పుతిన్-మోడీ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయని వెస్ట్రన్ దేశాలు, వెస్ట్రన్ మీడియా నిశితంగా గమనిస్తోంది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా పుతిన్ ఇండియా పర్యటనపై ఆసక్తి కనబరుస్తోంది. అక్కడి మీడియా ప్రధానంగా పుతిన్ పర్యటన గురించి మాట్లాడుతోంది. అయితే, భారత్ వెళ్లిన పుతిన్, పాకిస్తాన్‌కు ఎందుకు రారు? అనే ప్రశ్న సాధారణ పాకిస్తానీల్లో తలెత్తుతోంది. పుతిన్ చాలా సార్లు భారత్ వచ్చినప్పటికీ, పాకిస్తాన్‌కు రాకపోవడం వల్ల దాయాది దేశం తీవ్ర నిరాశ చెందుతోంది. పుతిన్ మాత్రమే కాదు, ఏ రష్యన్ అధ్యక్షుడు కూడా పాకిస్తాన్ సందర్శించలేదు.
Read Also: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఆగ్రహం.. ప్రయాణికులకు రీఫండ్ చెల్లించాలి
పాక్ జర్నలిస్ట్ చెబుతున్న చేదు నిజం..
పాకిస్తాన్ జర్నలిస్ట్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అర్జూ కజ్మీ పుతిన్ పాకిస్తాన్ ఎందుకు రాడో వివరించాడు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని పలుమార్లు తాము భిక్షాటన గిన్నెతో మిత్రదేశాలకు వెళ్తున్నామని చెప్పారని, పుతిన్ ఇక్కడి వచ్చి తన జేబును ఎందుకు ఖాళీ చేయించుకోవాలని అనుకుంటారు.? అని అన్నారు. పాకిస్తాన్ రక్షణ విశ్లేషకుడు ఖమర్ చీమా ఇంటర్వ్యూలో అర్జూ కజ్మీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ పాకిస్తాన్ ఎందుకు రారు..? భారత్ తో సరదాగా మాట్లాడుతున్నారు అని చీమా, ఖజ్మీని ప్రశ్నించారు. ‘‘ మనకు ఆయనతో ఏ వ్యాపారం ఉంది.? మనం ఆయనను ఆహ్వానిస్తే, ఏం చెబుతాము? ఫైటర్ జెట్లు, ఆయిల్ అప్పుపై ఇవ్వాలని కోరుతామా? భారత్‌కు ఇచ్చినట్లు మాకు ఇవ్వాలని అడుగుతామా? భారత్ డబ్బు చెల్లిస్తుంది. కానీ మనం ఎప్పుడూ వడ్డీలు లేకుండా, ఇన్‌స్టాల్మెంట్ పద్ధతిలో ఇస్తాం. ఇదే భారత్‌కు పాకిస్తాన్‌కు తేడా’’ అని ఆయన అన్నారు.
పుతిన్ మన కోసం ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా లేరని, అందుకే భారత్ వెళ్లారని, భారత్ నగదు చెల్లించి సరకులు తీసుకుంటోందని కజ్మీ చెప్పారు. పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుని, నగదు చెల్లించగలిగితే, ఇతర దేశాలు కూడా మన వద్దకు వస్తాయని అన్నారు.