India Pakistan: పాకిస్తాన్‌కి మరో బిగ్ షాక్ ఇచ్చింది భారత్. 24 గంటల పాటు చీనాబ్ నది నీటిని దిగ్బంధించిన భారత్ ఇప్పుడు ఆ నీటిని ఒక్కసారిగా వదిలినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ ‘‘వరద హెచ్చరికలు’’ జారీ చేసింది. హెడ్ మారాలా వద్ద చీనాబ్ నది నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. భారత్ 28,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. ఆ ఆకస్మిక నదీ ప్రవాహంతో పాకిస్తాన్ లోని సియాల్‌కోట్ నగరంతో పాటు గుజ్రాత్, హెడ్ ఖాదిరాబాద్ వంటి ప్రాంతాల్లో వరద హెచ్చరిలకు జారీ చేసింది.
Read Also: Obulapuram Mining Case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు..
చీనాబ్ నదిపై ఉన్న బాగ్లీహార్, సలాల్ డ్యాంల గేట్లను భారత్ ఒక్కసారిగా వదిలేయడంతో పాకిస్తాన్‌లో ఆందోళన మొదలైంది. చీనాబ్ నది వెంట ఉన్న పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లను, మౌలిక సదుపాయాలను, వ్యవసాయ భూముల్ని దెబ్బతీసే ఆకస్మిక నదీ ప్రవాహం గురించి అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులకు చీనాబ్ నదీ నీరు ప్రధాన వనరు. ఈ నదీ నటిపై పాక్ వ్యవసాయం ఆధారపడి ఉంది.
ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలుపుదల చేసింది. దీంతో పాకిస్తాన్‌లో వణుకు మొదలైంది. దీని తర్వాత చర్యల్లో భాగంగా చీనాబ్ నది నీటికి భారత్ అడ్డుకట్ట వేసింది. ఈ చర్య వల్ల పాకిస్తాన్‌లోని చీనాబ్ నదిలో నీరు పూర్తిగా కనిపించకుండా పోయింది. ఇప్పుడు, ఒకేసారి గేట్లు ఎత్తేయడంతో పాకిస్తాన్ వరదల పరిస్థితిని ఎదుర్కొంటోంది.