Gautam Gambhir: ఛీ అన్నారు.. దిగిపో అన్నారు.. కట్ చేస్తే! చరిత్ర సృష్టించిన టీమిండియా కోచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: న్యూజిలాండ్ పై భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం జట్టుకు అంత సులువైన విషయం కాదు. టీ20 ప్రపంచ కప్ 2024 సాధించిన తర్వాత నుంచి కొత్తగా బాధ్యతలు చేపట్టిన సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా టీ20 ఫార్మేట్ లో వరుస విజయాలు అందుకుంటూ కాస్త బలంగానే సాగింది. ఈ విషయంలో జట్టు ఒక్కటే కాదు.. కోచ్ సహకారం కూడా ఎంతగానో పని చేసిందనడంలో సందేహం లేదు.
Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌ను ‘మిసెస్’గా పరిచయం చేసిన హార్దిక్.. గ్రౌండ్ లోనే ఇద్దరూ కలిసి?
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
జట్టు తాజా విజయంతో టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో కోచ్‌గా రెండు ఐసీసీ టైటిళ్లు గెలిపించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గంభీర్ జట్టును వరుస విజయాల దిశగా నడిపిస్తూ రెండు అంతర్జాతీయ ట్రోఫీలను సాధించాడు. గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రూపంలో మొదటి ఐసీసీ టైటిల్ ను అందించాడు. ఆ టోర్నమెంట్ ఫైనల్లో కూడా భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో కూడా న్యూజిలాండ్‌ను ఓడించడం ద్వారా గంభీర్ తన రెండో ఐసీసీ టైటిల్ ను కోచ్ గా సాధించడం విశేషం.
Suryakumar Yadav: ధోని సరసన సూర్య.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..
ఇక మరొక ప్రత్యేకత ఏమిటంటే.. కోచ్ గా మాత్రమే కాకుండా, ఆటగాడిగా కూడా గంభీర్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచాడు. ఐసీసీ వరల్డ్ టీ20 వరల్డ్ కప్ 2007, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2011 విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆటగాడిగా రెండు ఐసీసీ ట్రోఫీలు, కోచ్‌గా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయ క్రికెటర్‌గా గంభీర్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నాడు.
Hear Gautam Gambhir's raw reactions after winning the ICC Men's #T20WorldCup 2026! 🎙️ pic.twitter.com/Cs1kokSSRT
— Star Sports (@StarSportsIndia) March 8, 2026
తాజావార్తలు
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?