Pakistan Woman: ‘‘మోడీ గారు మీరే నాకు న్యాయం చేయాలి’’ అని ప్రధాని నరేంద్రమోడీని పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళ కోరుతోంది. తన భర్త తనను మోసం చేసి, ఢిల్లీలో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. పాకిస్తాన్ కరాచీకి చెందిన నికితా నాగ్దేశ్ అనే మహిళ ప్రధాని మోడీకి వీడియో అప్పీల్ చేసింది.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు భారత్ అపూర్వ స్వాగతం పలికింది. ప్రధాని నరేంద్రమోడీ నేరుగా వెళ్లి ఎయిర్‌పోర్టులో పుతిన్‌ను రిసీవ్ చేసుకున్నారు. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి.
Pakistan: పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీ చీప్ అసిమ్ మునీర్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్)గా నియమించింది. ఇటీవల పాకిస్తాన్ రాజ్యాంగంలో 27వ రాజ్యాంగ సవరణ చేసి, అసిమ్ మునీర్‌కు సీడీఎఫ్ రూపంలో అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రభుత్వానికి సమాంతర వ్యక్తిగా, ఒక విధంగా చెప్పాలంటే పౌర ప్రభుత్వం కన్నా మిన్నగా ఆయన అధికారాలు ఉంటున్నాయి. ఈ సీడీఎఫ్ పదవిలో మునీర్ 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. Read…
పాకిస్థాన్‌లో అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్ దక్కింది. ఆర్మీ చీఫ్‌గా ఉన్న అతడు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ పొందాడు. తాజాగా రక్షణ దళాల అధిపతిగా అసిమ్ మునీర్ ప్రమోషన్ పొందాడు. దేశ తొలి రక్షణ దళాల అధిపతి (CDF)గా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నియామకానికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు.
PAK vs SL T20: జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు కొత్త ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది.
Pakistan: ఏ దేశానికైనా సైన్యం, దేశ భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తుంటుంది. కానీ, పాకిస్తాన్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. సైన్యం ఏం చేయకూడదో, అన్ని పనులను పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంటుంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా చాలా రంగాలు పాక్ సైన్యం చేతిలో ఉన్నాయి. నిజం చెప్పలంటే పాక్ అంటే సైన్యం, సైన్యం అంటే పాక్. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆ దేశ జాతీయ ఎయిర్ లైన్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.
Jaish-e-Mohammad (JeM): పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ తన వర్కింగ్ స్టైల్‌ను మార్చుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా జైష్ మహిళా ఉగ్రవాదుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. జైష్ చీప్ మసూద్ అజార్ సోదరి సయీదా నేతృత్వంలో జమాత్-ఉల్-మొమినాత్ అనే మహిళా ఉగ్రవాదం సంస్థను ఏర్పాటైంది
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ‘‘ప్రాణాలతోనే’’ ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాన్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పాక్ వ్యాప్తంగా ఇమ్రాన్ మరణించారని, ఆయనను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే ఊహాగానాలు వెలువడ్డాయి.
Pakistan: సహాయంలో కూడా దాయాది దేశం పాకిస్తాన్ నీచంగా ప్రవర్తించింది. గడువు తీరిన సహాయ సామాగ్రిని అందించి, తన బుద్ధి ఏంటో మరోసారి నిరూపించుకుంది. దిత్వా తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిని శ్రీలంకు సాయం చేస్తున్నామని చెబుతూ పాకిస్తాన్ హైకమిషన్ సహాయ ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, వాటిపై ఎక్స్పైరీ డేట్ 10/2024గా ఉంది. దీంతో పాకిస్తాన్‌పై విమర్శలు వాన మొదలైంది. గడువు తీరిన ఆహారాన్ని అందించడంపై పాక్ వైఖరిని నెటిజన్లు…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హత్యకు గురయ్యారంటూ గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు ఆయన క్షేమంగా ఉన్నారంటూ ప్రభుత్వం చెబుతోంది. అలాగైతే తమకు చూపించాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.