R-37M missile: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు నెలకున్న నేపథ్యంలో, ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా, భారత్‌కి డెడ్లీ మిస్సైల్‌ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, రష్యా తన లేటెస్ట్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57ని కూడా అందిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు R-37M హైపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ క్షిపణిని అందించేందుకు పుతిన్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ వద్ద ఉన్న Su-30MKI ఫైటర్ జెట్లకు ఈ క్షిపణులను అమర్చాలనే…
Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పుకుంటూ వస్తున్న దాయాది పాకిస్తాన్, ఒక్కొక్కటిగా నిజాలను చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని ఒప్పుకున్నారు. మే 9-10 రాత్రి భారత్ రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది, తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందని, పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని పాకిస్తాన్…
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి షకుర్ ఖాన్‌ను బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది. షకుర్ ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పట్టుబడింది. పోలీసుల కస్టడీ అనంతరం ఆమెను హర్యానాలోని హిసార్ జైలుకు తరలించారు. బుధవారం జైల్లో మల్హోత్రాను తండ్రి హరీష్ కలిశారు. జరిగిన పరిణామాలను తండ్రి అడిగి తెలుసుకున్నారు.
భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్మైన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
Pakistan: పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం ఫైజలాబాద్ డివిజన్లో 4.2 తీవ్రతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ తెలిపింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫైసలాబాద్ డివిజన్లోని ఝాంగ్ తహసీల్ సమీపంలో భూకంప కేంద్రం ఉంది.
Pakistan: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ బౌలర్ సదియా ఇక్బాల్ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. సదియా, ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. గత వారం ర్యాంకింగ్స్‌లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆమె ఓ స్థానం మెరుగుపర్చుకుంది.
Turkey: టర్కీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతీయులు ఆ దేశంపై మండిపడుతున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కిష్ డ్రోన్లతో పాటు వాటిని ఆపరేట్ చేయడాని ఆ దేశ సిబ్బందిని కూడా నియమించింది. భారత్ జరిపిన దాడుల్లో డ్రోన్లతో పాటు, వాటిని ఆపరేట్ చేయడానికి వచ్చిన సిబ్బంది కూడా హతమయ్యారు. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనకు వెళ్లారు.