జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ ఎత్తేసిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి. ఎప్పటికప్పుడు లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నా… భద్రతా బలగాలు వరసగా ఎన్ కౌంటర్లు చేసి ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి. సరిహద్దుల వెంబడి పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గింది. భద్రతా బలగాలు సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతో చాలా వరకు…
అసమ్మతి దెబ్బకు పదవిని వదులుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రవాస పౌరులను ఉద్దేశించి ఓ వీడియో సందేశంలో ఆయన అమెరికా తీరుపై వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా కోరినా తాను దానికి తలొగ్గలేదన్నారు. ఇలాంటి విషయాల్లో అమెరికా వత్తిడికి నేను లొంగలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగాక, పాక్ సైనిక…
జాతీయ పతాకానికి సంబంధించి పాకిస్థాన్ నెలకొల్పిన 18 ఏళ్ల రికార్డును భారత్ బద్దలుకొట్టింది. బీహార్ జగదీష్పూర్లో శనివారం నాడు సుమారు 77,900 మంది ప్రజలు ఒకేసారి భారత జాతీయ పతాకాలను చేతిలో పట్టుకుని గాలిలో ఊపుతూ రికార్డు సృష్టించారు. ఇది ఓ రికార్డు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని లెక్కించడానికి గిన్నిస్ రికార్డు సంస్థ ప్రత్యేకంగా కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రస్తుత అధికార పక్షం సభ్యులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి అందిన కానుకల విషయంలో కేవలం 20 శాతం డబ్బు కట్టి రూ. 5.7కోట్లను ఇమ్రాన్ సొమ్ము చేసుకున్నారని మండిపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించి మరో దుబారా ఖర్చును ప్రభుత్వ నేతలు బహిర్గతం చేశారు. ఇమ్రాన్ తన ప్రభుత్వ హయాంలో ప్రధాని నివాసం నుంచి బానీగాలాలోని ప్రైవేటు…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెదిరింపుల వ్యవహారం చర్చగా మారింది.. తమ నేత ఇమ్రాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొనడంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఇమ్రాన్ ఖాన్‌కు పూర్తి భద్రతల కల్పించాలని.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రధాని షరీఫ్ ఆదేశించినట్లు ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇమ్రాన్ భద్రత విషయంలో తక్షణ, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు..…
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని ఖోస్ట్ ప్రావిన్సుతో పాటు కునార్లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు .26 పాకిస్థాన్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. తాలిబన్ పోలీస్ చీఫ్ అధికార ప్రతినిధి ఈ దాడులను ధృవీకరించారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడినట్లు ఆయన…
ఊహించని పరిణామాలతో ప్రధాని పదవి కోల్పోయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.. తనకు ఇప్పుడు పదవి లేదని, తాను మరింత ప్రమాదకరంగా మారుతానంటూ వార్నింగ్ ఇచ్చారు.. ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత తొలిసారి పెషావర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రమాదకారిని కాదు.. కానీ, ఇప్పుడు మరింత ప్రమాదకారిగా మారుతానని పేర్కొన్నారు.. దేశంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీల…
పాకిస్థాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది నేషనల్ అసెంబ్లీ.. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి షహబాజ్ షరీఫ్ ప్రసంగించారు. పాకిస్థాన్‌కు చైనా, సౌదీ, టర్కీ స్నేహితులని చెప్పుకొచ్చారు. చైనా సహకారంతో ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టిస్తామన్నారాయన. అయితే, భారత్, అమెరికాలతో సత్సంబంధాలు ముఖ్యమే అన్నారు షరీఫ్. తాము భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నా… కశ్మీర్‌కు శాంతియుత పరిష్కారంతోనే అది సాధ్యమన్నారాయన. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతామన్నారు పాక్ కొత్త ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇక, కశ్మీర్లో…
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలు పెట్టిన పరీక్షలో ఓడిపోయారు. జాతీయ అసెంబ్లీ విశ్వాసం సొందటంలో ఆయన విఫలమయ్యారు. శనివారం అర్ధరాత్రి అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో విపక్షాలు విజయం సాధించాయి. దాంతో ఇమ్రాన్ తన పదవిని కోల్పోయారు. దేశ చరిత్రలోనే అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి వైదొలిగిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. పదవిని కాపాడుకనేందుకు చివరి వరకు పోరాడిన ఆయనకు ఓటమి తప్పలేదు. దాంతో పాకిస్తాన్ 75 ఏళ్ల చరిత్రలో ఇప్పటి…
పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది పాక్ సుప్రీంకోర్టు… వెంటనే నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది… ఇక, నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అధ్యక్షుడిని కోరలేరని పేర్కొంది.. ఇవాళ అసెంబ్లీని సమావేశ పర్చాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.…