Asia Cup 2022: పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. టార్గెట్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2022: దుబాయ్ వేదికగా ఆసియా కప్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ 10 పరుగులకు అవుటయ్యాడు. ఓపెనర్ రిజ్వాన్ (43) నిలబడ్డా అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. వరుస విరామాల్లో పాకిస్థాన్ వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ నత్తనడకన నడిచింది. చివర్లో టెయిలెండర్ దహానీ రెండు సిక్సర్లు కొట్టడంతో ఆ జట్టు 147 పరుగులు చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలవాలంటే టీమిండియా 148 పరుగులు చేయాలి.
Read Also: IND Vs PAK: టాస్ గెలిచిన భారత్.. పంత్ స్థానంలో దినేష్ కార్తీక్‌కు చోటు
Also Read
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై 'కింగ్' కోహ్లీ కన్ను!
- Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
- Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
భారత బౌలర్లలో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు 4 వికెట్లు తీసి పాకిస్థాన్‌ను దెబ్బ తీశాడు. హార్దిక్ పాండ్యా కూడా కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడు 3 వికెట్లతో రాణించాడు. అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీయగా అవేష్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా పాకిస్థాన్ వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో 148 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందా.. ఛేదిస్తే ఎన్ని వికెట్లు కోల్పోతుంది.. లేదా చతికిలపడుతుందా అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?