ఇండియా పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఖండ భారత్ 1947లో ఇండియా పాక్ దేశాలుగా విడిపోయింది. ఇండియాను హిందూస్తాన్ అని పిలిస్తే ముస్లీంలు ఉన్న దేశాన్ని పాకిస్తాన్ అని పిలుస్తున్నారు. అయితే, ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వచ్చింది. ఎవరు నిర్ణయించారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహ్మద్ ఆలీ జిన్నా, కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. బయటకు…
ప్రయాణాలు చేయడం చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కొంతమంది అడ్వెంచర్ జర్నీలు చేస్తుంటారు. అడ్వెంచర్ జర్నీలు చేసే వారు పర్వతాలను అధిరోహించేందుకు అసక్తి చూపుతుంటారు. కొన్ని పర్వతాలు అధిరోహించేందుకు చాలా ఈజీగా ఉంటాయి. కొన్ని మాత్రం ఇబ్బందులు పెడుతుంటాయి. కానీ, పాకిస్తాన్లో ఉన్న నంగా పర్బత్ అనే పర్వతాన్ని అధిరోహించాలంటే ప్రాణాపై ఆశను వదిలేసుకోవాల్సిందే. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఈ నంగా పర్బత్ తొమ్మదోది కాగా, పాక్‌లో రెండో ఎత్తైన శిఖరం. ఈ నంగా పర్బత్…
జమ్ముకశ్మీర్‌లోని సాంబా సరిహద్దులో పాకిస్థాన్ చొరబాటు దారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న ముగ్గురు పాక్ స్మగ్లర్లను బీఎస్ఎఫ్ బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని భద్రతాధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల ద్వారా ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లు చొరబడుతుండగా భద్రతా దళాలు వారిని హతమార్చాయి. హతులు ముగ్గురినించి 36 ప్యాకెట్ల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30…
భారత దేశంతో పాటు వివిధ దేశాలలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కాశ్మీర్, నోయిడాలో భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది. ఇటు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది. మనదేశంతో పాటు అఫ్గానిస్థాన్- తజికిస్థాన్ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం భారత్‌లోని కశ్మీర్, నోయిడా సహా ఇతర…
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రక్తసిక్తంగా మారింది. బలూచిస్తాన్‌లోని పాక్ ఆర్మీ మేజర్ కార్యాలయంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆత్మాహుతి దాడిలో 100 మంది పాక్ సైనికులు మరణించారు. మిలటరీ బేస్‌ను లక్ష్యంగా చేసుకొని పంజూర్, నోష్కీ పోస్టులపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందు దాడి జరగడంతో పాక్‌లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, దాడిలో కేవలం 11 మంది మాత్రమే…
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో…
పాక్ చైనాల మధ్య విడిపోలేని బంధం ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో చైనా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి పాక్‌కు చుక్కలు చూపిస్తున్నది. పాక్‌కు ఆర్థికంగా అండదండలుగా ఉన్న చైనా, నష్టపరిహారాన్ని వసూలు చేయడంలో కూడా అదే తీరును ప్రదర్శిస్తోంది. పాక్‌లో దాసు హైడ్రోపవర్ ప్రాజెక్టును చైనాకు చెందిన జెగ్‌హుబా కంపెనీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. అయితే, ఈ ప్రాజెక్టు వద్ద 2021 జులై 14 వ తేదీన ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 36 మంది…
ధరల పెరుగుదల అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. నిత్యావసరాల నుంచి ప్రతీది పెరిగిపోతోంది.. ఓవైపు వేతనాల్లో పెద్దగా పెరుగుదల లేకపోయినా.. అన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.. ప్రతీ సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు దీంతో ఆందోళనకు చెందుతున్నారంటే సర్వసాధారణమే.. కానీ, ఏకంగా ఓ దేశ ప్రధానికే ఈ వ్యవహారం నిద్ర పట్టనివ్వడం లేదట.. ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ధరల పెరుగుదలపై స్పందించిన ఇమ్రాన్.. ధరల పెరుగుదల ఒక్కొక్కసారి తనను రాత్రివేళల్లో నిద్రపోనివ్వడం…
బెస్ట్ టీ20 క్రికెటర్ 2021 అవార్డుకు పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ ను ఎంపిక చేసింది ఐసీసీ.. పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. కాగా, 2021లో టీ-20ల్లో చెలిరేగి పోయాడు రిజ్వాన్.. 29 మ్యాచ్‌లు ఆడిన ఈ పాక్ ప్లేయర్.. 73.66 సగటుతో 1,326 పరుగులు చేశాడు.. స్ట్రయిక్ రేట్ 134.89 సాధించాడు.. బ్యాటింగ్‌లోనే కాదు.. మరోవైపు వికెట్ కీపర్‌గానూ…
పాకిస్థాన్‌లో భారీలు పేలుడు సంభవించింది.. లాహోర్‌లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి దగ్గర జరిగిన భారీ బాంబు పేలుడులో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. బాంబు పేలుడుపై మీడియాతో మాట్లాడిన లాహోర్ పోలీసులు.. ముగ్గురు మరణించినట్టు వెల్లడించారు.. ఇక, ప్రమాదం జరిగిన…