హైదరాబాద్ లోని కేంద్ర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను పాకిస్తానీ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు. కంచన్‌బాగ్ డి అర్ డి ఎల్ లో తాజాగా బయటపడిన హనీ ట్రాప్ కేస్ లో కీలకాంశాలు బయటపడుతున్నాయి. డీఆర్డీఎల్లో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డిని హనీ ట్రాప్ చేసింది నటాషా అనే అమ్మాయి. కె సీరీస్ మిస్సైల్ కు చెందిన కీలక సమాచారాన్ని నటాషాకు చేరవేశాడు మల్లికార్జునరెడ్డి. యుకే అనుసంద డిఫెన్స్ జర్నలిస్ట్ పేరుతో ట్రాప్ చేసింది నటాషా.…
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల బహవల్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాళ్ల వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జూన్ 5వ తేదీన జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అక్కాచెల్లెళ్లను తుపాకీతో బెదిరించి ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఉమైర్ అష్ఫాక్, కాషిఫ్…
పాకిస్తాన్ దేశంలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఎంతలా అంటే అక్కడ మంత్రులు టీ తాగడాన్ని తగ్గించండి అనే స్థాయికి దిగజారింది. ఇతర దేశాల నుంచి ‘టీ’ దిగుమతి చేసుకునేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. ఇక ఇంధన సమస్యతో విద్యుత్ వినియోగాన్ని తక్కువ చేయడానికి సాయంత్రం వరకే షాపులు, మార్కెట్లు తెరవాలని రాత్రి 10 తరువాత పెళ్లి వేడులకు జరపకూడదని ఆదేశాలు ఇస్తోంది అక్కడి సర్కార్. ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ ప్రధానులు,…
దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆ దేశం దివాళా అంచున ఉంది. కొన్ని రోజుల్లో శ్రీలంక పట్టిన గతే పాకిస్తాన్ కు కూడా పట్టబోతోందని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఎడాపెడా డిజిల్, పెట్రోల్ రేట్లు పెంచుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారకుండా చర్యలు తీసుకుంటుంది. తాజాగా పాకిస్తాన్ ఫెడరల్…
ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చికిత్స పొందుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో పాకిస్థాన్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన కోలుకోవడం అసాధ్యంగా మారిందని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఆయనను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ముషారఫ్ ఫ్యామిలీ కోరుకుంటే స్వదేశానికి ఆయనను తరలించేందుకు వీలు కల్పిస్తామరి పాక్ సైన్యం పేర్కొన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.అలాగే ‘కుటుంబ సభ్యుల అంగీకారం, వైద్యుల సలహా మీదట…
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మిలిటరీ రూలర్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. 78 ఏళ్ల వయసులో తీవ్ర ఆరోగ్య సమస్యలతో, ఆరోగ్యం క్షీణించడంతో దుబాయ్ లోని ఓ అమెరికన్ ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ముషారఫ్ ను చూసేందుకు ఆయన బంధువులు పాక్ నుంచి దుబాయ్ వెళ్లారు. 1999 నుంచి…
పాకిస్తాన్ లో మైనారిటీల అణచివేత కొనసాగుతూనే ఉంది. బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు, హిందూ అమ్మాయిలను అపహరించుకుని వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడం, అత్యాచారాలకు పాల్పడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో అక్కడ మైనారిటీ హిందువులకు చెందిన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. గతేడాది అక్టోబర్ నెలలో కొత్రిలోని సింధు నది ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తాజాగా బుధవారం రోజు పాక్ లో మరో…
మరో ఆసియా దేశం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. ఇప్పటికే శ్రీలంక దారిలోనే దాయాది దేశం పాకిస్తాన్ పయణిస్తోంది. తాజాగా ఆ దేశంలో కరెంట్ ఇబ్బందులు తారాస్థాయికి చేరాయి. ఎంతలా విద్యుత్ ఆదా చేసేందుకు పెళ్లి వేడులకు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో రాత్రి 10 గంటల తర్వాత వివాహ వేడుకలను నిషేధించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం భారీగా ఉంది. జూన్ 8 నుంచి ఈ నిషేధం…
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలూచిస్థాన్‌లోని ఓ పర్వత ప్రాంతంలో ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ వ్యాను 1,572 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. Bhadradri: ఆగంతకుల దుశ్చర్య.. రాముడిని వదల్లేదు బలూచిస్థాన్ రాష్ట్రంలోని ఝోబ్ నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగిందని పాకిస్థాన్ వార్తా సంస్థ ‘డాన్’ వెల్లడించింది.…
పంజాబ్ లో అసలేం జరుగుతోంది. గతేడాది గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రయత్నం చేసింది. రైతుల ముసుగులో తీవ్రవాదులను ఉసిగొల్పిందనే వాదన వినిపిస్తోంది. పంజాబ్ అంతటా తీవ్రవాదం పెంచేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఖలిస్తాన్ ఉద్యమం తోడయితే పంజాబ్, దానివల్ల దేశం ప్రమాదంలో పడనుంది.