పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడి జాతీయ అసెంబ్లీని… రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ చేస్తోన్న ప్రయత్నాలు సాఫీగా సాగేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతుండగా.. వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లుగా వచ్చే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమేనని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ చెబుతోంది. ముఖ్యంగా న్యాయపరమైన, రాజ్యాంగ…
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జాతీయ అసెంబ్లీలో ఆదివారం విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ తిరస్కరించారు. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీని కాపాడుకున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ఇమ్రాన్ ఖాన్ సిఫారసు పంపించారు. మరోవైపు తన సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని సభలో తిరస్కరించిన వెంటనే జాతిని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు.…
అవిశ్వాస తీర్మానంపై పోరాటం చేస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులతో కలసి ముగ్గురు దొంగలు పనిచేస్తున్నారని మండిపడ్డారు.. కొన్ని విదేశాల నుంచి మాకు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు.. విదేశీ శక్తులు కుట్ర చేస్తుంటే.. దేశం లోపల వారికి సహకరించే శత్రువులు కూడా ఉన్నారని, ఇద్దరు కీలక మిత్రపక్షాలు ఫిరాయించిన తర్వాత…
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దిగువ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు కీలక వ్యాఖ్యాలు చేశారు పీటీఐ నేతలు.. పార్లమెంట్ దిగువ సభలో పీటీఐ మెజారిటీ కోల్పోయిన తర్వాత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు పోరాడతారని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ అన్నారు. మాజీ క్రికెటర్ అయిన తన ప్రధాని గురించి.. చివరి బంతి వరకూ తన పోరాటం చేస్తారంటూ క్రికెట్ స్టైల్లో చెప్పేశారు.. ఇక, ఇవాళ సాయంత్రం ఇమ్రాన్‌ఖాన్ జాతిని…
పాకిస్థాన్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 227/3 వద్ద డిక్లేర్ చేయగా పాకిస్థాన్ ముందు 351 పరుగుల టార్గెట్ నిలిచింది.…
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై వ్యతిరేకత తీవ్రమైంది. అధికార కూటమి నుంచి ప్రధాన భాగస్వామ్య పార్టీలు తప్పుకోనున్నాయి. ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఎక్కువ కావడంతో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయనని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. తనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ…
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి కోల్పోయే ప్రమాదం ఉన్న ఆయన భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఖైబర్ ఫక్తూన్వాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్ ఖాన్.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నారు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదన్నారు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండటం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక, భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ…
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ముగిపోవడంతో.. ఆయనకు పదవీ గండం తప్పేలా లేదు. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 25 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నారు. ఈ నెలాఖరులో.. ఇమ్రాన్‌ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్ర…
పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.. పాకిస్థాన్‌లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడు ఏకంగా 30 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.. వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో కోచా రిసల్దార్ ప్రాంతంలో జరిగిన పేలుడులో కనీసం 30 మంది మరణించారని.. వంద మందికి పైగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు.. పెషావర్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.. మేం…
ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ సమస్య, నీటి వనరుల సమస్యలు ఇలా ఎన్నో ఉన్నాయి. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. రెండుదేశాలు ద్వైపాక్షికంగా ఎన్నోసార్లు చర్చించుకున్నా పరిష్కారం కాలేదు. కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాక్‌తో సంబంధాలు మరింత దిగజారాయి. పాక్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలికితేనే ఆ దేశంలో చర్చలు…