Worst Record: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. బాబర్ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటోంది. టీమిండియాతో మ్యాచ్ పక్కన పెడితే జింబాబ్వే లాంటి జట్టుపైనా ఓడటం ఆ జట్టు మానసిక పరిస్థితిని బహిర్గతం చేస్తోంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా తమ జట్టుపై మాటల తూటాలతో పాటు సెటైర్లు పేలుస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు పాకిస్థాన్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా నెగ్గలేదు.…
PAK Vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో గురువారం సంచలనం నమోదైంది. బలమైన పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో జింబాబ్వే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అటు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో కూడా స్వయంగా ట్వీట్ చేశారు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలోని జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ఈ దఫా తమ దేశానికి ఫేక్ మిస్టర్ బీన్‌ను కాకుండా రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలంటూ ఎద్దేవా చేశారు. దీంతో…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. పాకిస్థాన్ జట్టును జింబాబ్వే ఓడించింది. పెర్త్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చారిత్రక విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని కూడా పాకిస్థాన్ ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో బాగానే ఆడిన జింబాబ్వే అనంతరం పాక్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు…
INDIA vs PAKISTAN: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. శ్రీనగర్‌లో నిర్వహించిన 'శౌర్య దివస్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి భారత జట్టు శుభారంభం చేసింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఫుల్ జోష్‌తో ఉండగా.. పాక్ జట్టు చాలా కసిగా ఉంది. భారత్, పాక్ జట్లు మళ్లీ తలబడితే చూడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
Imran Khan's plea against politics ban rejected by Pakistan court: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరస షాక్ లు ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే అనేక కేసులు ఇమ్రాన్ ఖాన్ పై నమోదు అయ్యాయి. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టినందుకు అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు ప్రభుత్వ పదవిలో…
IND Vs PAK: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు అతి పెద్ద సమరం జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ మరోదానికి లేదు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు లక్ష మంది అభిమానులు మెల్బోర్న్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన షమీని రోహిత్ జట్టులోకి తీసుకున్నాడు.…
Team India: మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంటిమెంట్ అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. అక్టోబర్‌లో మ్యాచ్‌లు అంటే కోహ్లీకి పూనకం వస్తుందని.. ముఖ్యంగా 2011 నుంచి 2021 వరకు అక్టోబర్ 21-24 మధ్య తేదీల్లో టీమిండియా మ్యాచ్ ఆడితే విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు మ్యాచ్ జరిగే తేదీ అక్టోబర్ 23 కాబట్టి తమ స్టార్ చెలరేగిపోవడం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఇటీవల…
IND Vs PAK: మెల్బోర్న్ వేదికగా కాసేపట్లో భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో స్టేడియం పరిసరాల్లో సందడి నెలకొంది. దాయాదుల మహాసమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారు. భారత జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం పడకపోవడంతో భారత్ అభిమానులు ఖుషీలో ఉన్నారు. ఈరోజు వరుణుడు పక్క దేశాలకు వెళ్లిపోవాలని ప్రార్థిస్తు్న్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి టోర్నీలో శుభారంభం ఇవ్వానలి కోరుకుంటున్నారు.…