Pakistan Economic Crisis:రాజకీయ అస్థిరత, తీవ్ర ఆర్థిక సంక్షోభం దాయాది దేశం పాకిస్తాన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఆ దేశ రక్షణ మంత్రి ఏకంగా పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని వ్యాఖ్యానించడం చూస్తే ఆ దేశ పరిస్థితి ఏంటో తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో చర్చలు నిర్వహించింది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఈ ఒప్పందంపై స్పష్టత రాలేదు.
Pakistan Girl : ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. దేశాన్ని దాటుకుని వచ్చి అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తన మతం తెలియకుండా ఉండేందుకు భర్త కోసం తన పేరు కూడా మార్చుకుంది.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి ప్రజలు గోధుమ పిండి, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితుల నుంచి తమను కాపాడాలని ఐఎంఎఫ్ ని అడుగుతోంది. ఇటీవల పదిరోజుల పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాక్ ప్రభుత్వం చర్చలు జరిపింది.
Pakistan: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 40 వేలను దాటింది. ఇదిలా ఉంటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు టర్కీకి భూకంప సాయాన్ని అందిస్తున్నాయి. రెస్క్యూ నుంచి మెడిసిన్స్ వరకు అన్నింటిని సహాయంగా అందిస్తున్నాయి. అయతే టర్కీకి అత్యంత మిత్రదేశం పాకిస్తాన్ కూడా సాయం చేద్దాం అనుకుంది. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్న పాకిస్తాన్ టర్కీకి సాయం చేసి మరోసారి పరువు తీసుకుంది.
పాకిస్తాన్ వాణిజ్య నగరంలో కరాచీలో భారీ ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీస్ కార్యాలయమే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. కరాచీలోని షరియా ఫైసల్ ప్రాంతంలో ఉన్న పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం. కనీసం 8-10 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం కార్యాలయంలో ఉన్నట్లు పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Imran Khan: పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజ్ కోసం తాత్కాలిక ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంపై పాక్ మాజీ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్ (ఆస్పిరిన్)(నొప్పి నుంచి ఉపశమనానికి వాడే ట్యాబ్లెట్)ను వాడతారా..?
Tax Survey on BBC:భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ టాక్స్ సర్వే చేపడుతోంది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. ఐటీ పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ బీబీసీ కార్యాలయాల్లో రైడ్స్ చేస్తోంది. గతంలో నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా బీబీసీ ధిక్కరించిందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ టాక్స్ సర్వేపై ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ ని ప్రశ్నించారు.
ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది.
Pakistan: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. పాలు, టీ తదితర నిత్యావసర సరుకులు కొనడం సామాన్యులకు కష్టతరంగా మారింది.
2019, ఫిబ్రవరి 14.. 40 ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్న రోజు. దేశం ఆగ్రహావేశాలతో ఊగిపోయిన రోజు. 40 మంది ధైర్యవంతులు వీరమరణం పొందిన రోజు. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సైనికులపై దాడి జరిగి నేటికి నాలుగేళ్లు.