తోషాఖానా కేసు విచారణకు సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైందని పాక్ మీడియా వెల్లడించింది.
పాకిస్తాన్లో దిగువ కోహిస్థాన్‌లోని పట్టాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ, ఆమె అత్తగారు, ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు సహా ఒకే కుటుంబంలోని పది మంది సభ్యులు మరణించారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎమ్ఎల్-ఎన్) వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరారు.
Pakistan Army Chief Supports Imran Khan's Arrest: ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితానికి ముగింపు పలికే దిశగా అక్కడి ప్రభుత్వం, ఆర్మీ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టును పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సమర్థిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ డాన్ నివేదించింది. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి పొలిటికల్ కెరీర్ ను అంతం చేయడాన్ని ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సమర్థించినట్లు తెలిసింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే తనకు ప్రమాదం ఉందని, అరెస్ట్ చేసి…
India invites Pakistan: ఏప్రిల్ నెలలో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీఓ) సమావేశానికి పాకిస్తాన్ దేశాన్ని భారత్ ఆహ్వానించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరగాల్సిన ఎస్ సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ఆహ్వనం అందినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుకు కూడా భారత్ ఆహ్వానం పంపింది. ఖవాజా భారత్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు.
Imran Khan Arrest: పాకిస్తాన్ రణరంగంగా మారుతోంది. సివిల్ వార్ దిశగా పాకిస్తాన్ వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి ఆర్మీ, పోలీసులను ఇమ్రాన్ మద్దతుదారులు సవాల్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు లాహోర్ లోని జమాన్ పార్క్ వద్ద…
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఇస్తే తప్పా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే అక్కడ ఆహార సంక్షోభం నెలకొంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఒక వేళ ధరలు పెరిగినా కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న తగినంత సరకులు అందుబాటులో ఉండటం లేదు. గోధుమ పిండితో పాటు వంటనూనె, చక్కెర ఇలా పలు నిత్యావసరాల కొరత వేధిస్తోంది.
Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ట్రాన్స్మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ రాజధానితో పాటు ప్రధాన నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఒక రోజు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాజాగా మరోసారి పాక్ విద్యుత్ వ్యవస్థ వైఫల్యం చెందింది. పాక్ వాణిజ్య నగరం, అతిపెద్ద నగరం అయిన కరాచీ తీవ్ర విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోంది.
India On Pakistan: పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో సోమవారం 146వ ఇంటరం పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ సోమవారం భారత్, పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీయూలో కూడా పాక్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్ ను ‘‘ఉగ్రవాద ఎగుమతిదారు’’ విమర్శించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఖాతూన్ జడ్జి జెబా చౌదరిని బెదిరించిన కేసుకు సంబంధించి సివిల్ జడ్జి జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.