Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పొరుగు దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తోంది. 1.1 బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ ఇస్తేనే ప్రస్తుతం పాకిస్తాన్ బతికిబట్టకడుతుంది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన షరతులు కఠినంగా ఉన్నా కూడా పాక్ సర్కార్ అంగీకరించాల్సి వస్తోందని సాక్షాత్తు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ అన్నారు. ఈ షరతుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచుతోంది. ఇప్పటికే ధరలు పెరిగి కష్టాల్లో ఉన్న పాక్ ప్రజలు మరింత కష్టాల్లోకి నెట్టేయబడుతున్నారు.
S Jaishankar on Pakistan economic crisis: పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ఉంది దాయాది దేశం పాకిస్తాన్. తమ దేశం ఇప్పటికే దివాళా తీసిందని సాక్షాత్తు అక్కడి మంత్రులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. క్లిష్ట సమయంలో ఐఎంఎఫ్ కానీ, పాక్ మిత్రదేశాలు అయిన సౌదీ, యూఏఈ, చైనా వంటివి కూడా పాకిస్తాన్ కు సాయాన్ని అందించేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు రాజకీయ అస్థిరత కూడా పాకిస్తాన్ పరిస్థితి దిగజారడానికి కారణం అయింది. ఐఎంఎఫ్…
Pakistan Economic Crisis- Viral Video: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రజలకు భారత్ విలువ తెలుస్తోంది. మాకు నరేంద్రమోదీ లాంటి ప్రధాని కావాలంటూ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్ జర్నలిస్ట్, యూట్యూబర్ సనా అమ్జాద్ ఓ యువకుడిని ‘‘ పాకిస్తాన్ నుంచి బతికి బట్టకట్టాలంటే మనం ఇండియాకు వెళ్లాలి’’ అని ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించిన సందర్భంలో ఆతను చెప్పిన సమాధానం ప్రస్తుతం రెండు దేశాల్లో వైరల్ గా మారింది.
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ బయటపడేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అప్పుకోసం అనేక పన్నులు విధించిన ఆ దేశం ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. తాజాగా మంత్రుల, సలహాదారుల అలవెన్సులు, ప్రయాణ ఖర్చులను తగ్గించనున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.
Pakistan: హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్, గ్లోబల్ టెర్రరిస్ట్ సయ్యద్ సలాహుద్దీన్ ఇటీవల పాకిస్తాన్లో హతమైన భారతదేశం వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన బషీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియలకు నాయకత్వం వహించినట్లు గుర్తించారు. బషీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అక్కడ సయ్యద్ సలాహుద్దీన్‌ను పాకిస్తాన్ సైనికులు చుట్టుముట్టినట్లు చూడవచ్చు. నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని సురక్షిత ప్రదేశంలో అంత్యక్రియలు జరిగాయి. వైరల్ ఫుటేజీలో సలావుద్దీన్ భారతదేశాన్ని నాశనం…
Elgar Parishad Case: ఎల్గార్ పరిషత్, మావోయిస్టు సంబంధాల కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. అతని బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టుకు తెలిపింది. నవ్లాఖా జాతీయ భద్రత, ఐక్యత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపేలా పలు చర్యలకు పాల్పడ్డారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. నవ్లాఖా బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్ఐఏ న్యాయవాది సందేశ్…
భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరు పాకిస్థాన్‌లో హతమయ్యాడు. సోమవారం సాయంత్రం రావల్పిండిలోని ఓ దుకాణం బయట హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలం హత్యకు గురయ్యాడు.
అన్నాచెల్లెలు మధ్య సెక్స్ గురించి పాకిస్థాన్‌లోని ఓ యూనివర్సిటీ విద్యార్థులను వారి అభిప్రాయాలను అడిగిన నేపథ్యంలో సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు, విద్యార్థి సంఘాలు ఇస్లామాబాద్‌కు చెందిన సీఓఎంఎస్ఏటీఎస్ విశ్వవిద్యాలయం ప్రశ్నాపత్రంలోని ఈ అసభ్యకరమైన కంటెంట్‌ను నిందించారు.
Javed Akhtar: ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ఉగ్రపేలుళ్ల ఘటన గురించి గుర్తు చేస్తూ.. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 26/11 ఉగ్రవాదులు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. భారతీయుల హృదయాలలో చేదు గురించి పాకిస్తాన్లో చేసిన ముక్కుసూటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పురాణ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్‌లో జరిగిన ఉత్సవం కోసం జావేద్…