కేప్టౌన్లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ క్రీడామణులు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ (68*, 55బంతుల్లో), అయేషా నసీమ్ (43*, 25బంతుల్లో) అద్భుతంగా రాణించిన వేళ పాకిస్థాన్ భారత్కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Pakistan: పాకిస్తాన్ దేశంతో దైవదూషణ కేసుల్లో హత్యలు చేయడం పరిపాటిగా మారింది. గతంలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీలంక జాతీయుడిని దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ కొట్టి చంపారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తిని బయటకు ఈడ్చుకొచ్చి, పోలీసుల ముందే ప్రజలు కొట్టి చంపారు. పోలీసులు ఉన్న ఏం చేయలేకపోయారు.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ దివాళా అంచుకు చేరుకుంటోంది. కానీ ఆ దేశ సైన్యం మాత్రం ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంది. మాట మాట్లాడితే తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని భయపెడుతుంది తప్పితే.. అక్కడి ప్రజల ఆకలిని మాత్రం తీర్చలేకపోతోంది. ఉగ్రవాద దేశంగా ముద్ర పడిన పాకిస్తాన్, నానాటికి ప్రపంచంలో ఒంటరిగా మారుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తన ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా ప్రస్తుతం ముహం చాటేస్తోంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ కు…
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్, ఐఎంఎఫ్ బెయిలౌట్ సాయంతో బయటపడవచ్చని భావించింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్ తో గత పది రోజుల నుంచి పాక్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఐఎంఎఫ్ ఇచ్చే ఆర్థిక సాయంతో బయటపడవచ్చని భావించింది. అయితే ఐఎంఎఫ్ తో పాక్ ప్రభుత్వం చర్చలు విఫలం అయినట్లు అక్కడి మీడియా చెబుతోంది.
Acid attack on minority girl in Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ, క్రిష్టియన్ యువతులను బలవంతంగా అపహరించి, మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలనే కాదు, పెళ్లై బిడ్డలు ఉన్న మహిళలను కూడా అపహరించి బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు.
Turkey insults Pakistan: అసలే ఆర్థిక ఇబ్బందుల్లో, కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ ను ఏ దేశం కూడా పట్టించుకోవడం లేదు. పతనానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది పాకిస్తాన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) షరతులకు తలొగ్గితేనే పాకిస్తాన్ కు అప్పు పుడుతుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ నాయకులు మాత్రం కొన్ని సందర్భాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు.
భవిష్యత్తులో ఇంధనాన్ని అధిక ధరలకు విక్రయించాలనే లక్ష్యంతో కొందరు ఫిల్లింగ్ స్టేషన్ల యజమానులు హోర్డింగ్కు పాల్పడుతున్నారని, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.