Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్ తుఫాన్’ తీవ్రరూపం దాల్చింది. అత్యంత తీవ్రమైన తుఫానుగా మారింది. ఈ తుఫాన్ ఉత్తర దిశగా కదులుతూ కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా గుజరాత్ ప్రాంతానికి తీవ్ర ముప్పు ఏర్పడింది. జూన్ 15 గుజరాత్ లోని కచ్ జిల్లా, పాకిస్తాన్ లోని కరాచీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. సౌరాష్ట్ర, కచ్ తీరాలకు వాతావరణ కేంద్రం తుపాను హెచ్చరికలు జారీ చేసింది.
తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన అత్యంత తీవ్రమైన తుఫాను బిపార్జోయ్ గత ఆరు గంటల్లో గంటకు ఎనిమిది కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతోందని, ముంబైకి పశ్చిమాన 550 కి.మీ, దక్షిణాన 450 కి.మీ దూరంలో ఉదయం 11.30 గంటలకు కేంద్రీకృతం అయింది. పోర్‌బందర్‌కు నైరుతి, దేవభూమి ద్వారకకు నైరుతి-నైరుతి దిశలో 490 కి.మీ., నలియాకు నైరుతి-నైరుతి దిశలో 570 కి.మీ, కరాచీ (పాకిస్థాన్)కి దక్షిణంగా 750 కి.మీ ఐఎండీ తెలిపింది.
Read Also: Amarnath Yatra 2023: అమర్ నాథ్ యాత్రికులు ఈ ఫుడ్ తినకుండా బ్యాన్..
జూన్ 14 ఉదయం వరకు తుఫాను దాదాపు ఉత్తరం వైపుగా కదిలి, తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి, జూన్ 15 మధ్యాహ్నం సమయంలో గుజరాత్‌లోని మాండ్వి, సౌరాష్ట్ర, కచ్, పాకిస్తాన్ లోని కరాచీల మధ్య తీరాన్ని దాటనుంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 5-135 కి.మీ వేగంతో 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గరిష్ట వేగం 63-88 kmph పరిధిలో ఉన్నప్పుడు తుఫాన్ గా, గంటకు 89 మరియు 117 కిమీ వేగంతో గాలు వీస్తే తీవ్రమైన తుఫానుగా, 118 మరియు 165 కిమీల ఉంటే చాలా తీవ్రమైన తుఫానుగా, 166 మరియు 220 కిమీల మధ్య గాలులు వేగం ఉంటే అత్యంత తీవ్రమైన తుఫానుగా వర్గీకరిస్తారు.
గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, జునాగఢ్, మోర్బీలతో సహా పలు జిల్లాలకు ఐఎండీ భారీ వర్షపాత హెచ్చరిక జారీ చేసింది. తూర్పు-మధ్య, పశ్చిమ-మధ్య, ఉత్తర అరేబియా సముద్రంలో చేపల వేట కార్యకలాపాలను జూన్ 15 వరకు పూర్తిగా నిలిపివేయాలని హెచ్చరించింది. జూన్ 15న గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పరిస్థితులను ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది.