Vivo T5e: వివో T5e భారత్‌లో లాంచ్.. రూ.13,999కే 5,500mAh బ్యాటరీ, AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ
- టీ-సిరీస్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Vivo T5e
- రూ.13,999కే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివో (Vivo) భారత మార్కెట్లో టీ-సిరీస్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Vivo T5eను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, AI ఆధారిత ఫీచర్లు, బలమైన నిర్మాణంతో యూజర్లను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందించింది. కొత్త Vivo T5eలో 5,500mAh భారీ బ్యాటరీ, Android 16 ఆధారిత OriginOS 6, IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, మిలిటరీ-గ్రేడ్ మన్నిక వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా AI Creation, AI Cutout, Vivo DocMaster వంటి స్మార్ట్ AI టూల్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Vivo T5e ధర, లభ్యత
Vivo T5e 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం Vivo అధికారిక వెబ్సైట్, Flipkartతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Shadow Grey, Aero Blue అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Also Read
- Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
- 5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
- Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
- HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
Vivo T5e స్పెసిఫికేషన్స్
Vivo T5eలో 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌కు UNISOC T7225 ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తినిస్తుంది. ఇందులో 4GB RAMతో పాటు 4GB Extended RAM సపోర్ట్ ఉండటంతో మొత్తం 8GB వరకు RAM అనుభవాన్ని పొందవచ్చు.
కెమెరా ఎలా ఉంది?
ఫోటోగ్రఫీ కోసం Vivo T5eలో 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ, రోజువారీ ఫోటోగ్రఫీ అవసరాలకు ఈ కెమెరా సరిపోతుందని కంపెనీ చెబుతోంది.
AI ఫీచర్లతో మరింత స్మార్ట్
ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. ఇందులోని ముఖ్యమైన AI ఫీచర్లు AI Creation – టెక్స్ట్ రూపొందించేందుకు, AI Cutout – ఫోటోలలోని బ్యాక్‌గ్రౌండ్‌ను సులభంగా తొలగించేందుకు, Vivo DocMaster- డాక్యుమెంట్లను స్కాన్ చేయడం, నిర్వహించడం కోసం ఈ AI టూల్స్ విద్యార్థులు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగకరంగా ఉంటాయి.
బ్యాటరీ, ఇతర ఫీచర్లు
Vivo T5eలో 5,500mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే Battery Health Protection టెక్నాలజీతో బ్యాటరీ పనితీరు ఎక్కువ కాలం నిలకడగా ఉంటుందని కంపెనీ తెలిపింది. వివో ప్రకారం, ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల వరకు స్థిరమైన పనితీరును అందిస్తుంది. అదనంగా ఇందులో IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, మిలిటరీ-గ్రేడ్ మన్నిక, Wet-Hand Touch సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కొనుగోలు చేయాలా?
రూ.13,999 ధరలో ఎక్కువ బ్యాటరీ, AI ఫీచర్లు, బలమైన బిల్డ్ క్వాలిటీ, Android 16 వంటి ఫీచర్లను కోరుకునే వారికి Vivo T5e మంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్, రోజువారీ వినియోగానికి నమ్మకమైన పనితీరు కోరుకునే వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!