2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో కలిపి 151 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైభవ్ బాగా ఆడాడని, అతడిలో అసాధారణ టాలెంట్ ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అన్నారు. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని వైభవ్‌ను వెంటనే భారత వన్డే జట్టులోకి ఎంపిక చేయాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌కు సూచించాడు. అంతేకాదు వైభవ్‌ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు.
ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత జట్టుకు రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీ అత్యుత్తమ ఎంపిక అవుతుందని చెప్పాడు. ‘రోహిత్ ఇంకా వన్డేలు ఆడాలి. అతనితో పాటు వైభవ్ ఓపెనింగ్ చేస్తే జట్టుకు అద్భుతమైన ఆరంభాలు లభిస్తాయి. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటర్. అతడిని నాలుగో స్థానంలో ఆడిస్తే మిడిల్ ఆర్డర్ మరింత బలపడుతుంది. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో గిల్ ఉంటే భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా మారుతుంది’ అని చెప్పుకొచ్చారు.
Also Read
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
వైభవ్ సూర్యవంశీకి వన్డే జట్టులో చోటు కల్పించేందుకు ఇదే సరైన సమయమని ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డారు. ‘టీ20, వన్డేలకు పెద్ద తేడా ఉందని నేను భావించను. మంచి బంతి ఎక్కడైనా అదే విధంగా ఉంటుంది. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్‌గా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. అతడు జట్టుకు గెలిపించాల్సిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి మంచి ఆరంభం ఇస్తే.. మిగతా బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను నిర్మించుకునే అవకాశం ఉంటుంది’ అని వివరించాడు.
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు అర్ధశతకాలతో వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. వైభవ్‌ను ఎక్కువగా మార్చే ప్రయత్నం చేయొద్దని కూడా ఫరూఖ్ ఇంజినీర్ సూచించారు. ‘ వైభవ్ సహజసిద్ధమైన ప్రతిభ కలిగిన ఆటగాడు. కొంచెం షార్ట్ లెంగ్త్ బంతి పడితే అది నేరుగా సిక్స్‌కే వెళ్తుంది. గత తప్పుల నుంచి అతడు నేర్చుకుంటున్నాడు. అయితే అతడికి ఎక్కువగా కోచింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సిరీస్ఓ జీనియస్. వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా అలాంటి సహజసిద్ధమైన ఆటగాడే. వైభవ్‌కు నిరంతరం అవకాశాలు ఇస్తే భారత జట్టుకు అతడు ఎన్నో సంవత్సరాలు గొప్ప ఆస్తిగా నిలుస్తాడు’ అని ప్రశంసించారు.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!