15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio ‘Freedom Pack’: దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) స్వాతంత్య్ర దినోత్సవం 2026 సందర్భంగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం కొత్త ఫ్రీడమ్ ప్యాక్ (Freedom Pack)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10,000 ధరతో వచ్చిన ఈ ప్లాన్‌లో ఏకంగా 15 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రస్తుతం జియో బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో 15 నెలల వ్యాలిడిటీతో వస్తున్న ఏకైక ప్లాన్ ఇదే.
ఈ కొత్త ఫ్రీడమ్ ప్యాక్ జియో ఫైబర్ (JioFiber), జియో ఎయిర్ ఫైబర్ (Jio AirFiber) వినియోగదారులకు అందుబాటులో ఉంది. జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు MyJio యాప్‌లో కూడా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. రూ.10,000 ఈ ప్యాక్ లో వినియోగదారులకు 15 నెలల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. ప్లాన్‌లో 100 Mbps డౌన్లోడ్, 100 Mbps అప్లోడ్ స్పీడ్ అందిస్తున్నారు. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా ఉచితంగా లభిస్తుంది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ఈ ప్లాన్‌తో జియో టీవీ (JioTV) ద్వారా 1,000కు పైగా టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. దీంతో ప్రత్యేకంగా DTH కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే టీవీ ఛానళ్లను చూడవచ్చు. ఇక వీటితోపాటు ఈ ప్లాన్‌లో వినియోగదారులకు మొత్తం 12 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, సన్నెక్స్ట్, హోయ్‌చోయ్, డిస్కవరీ+, టైమ్స్ప్లే, తరంగ్ ప్లస్, ఈరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, షెమరూమీ, ఈటీవీ విన్ లు ఉన్నాయి. ఈ OTT సబ్స్క్రిప్షన్లతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, టీవీ షోలు వంటి విభిన్న వినోద కంటెంట్‌ను మొబైల్, టీవీ, ట్యాబ్లెట్ లేదా ఇతర డివైస్‌లలో వీక్షించవచ్చు.

ఈ ప్యాక్ ను తీసుకునే కస్టమర్లకు జియో ఉచిత Set-Top Box (STB) కూడా అందిస్తోంది. ఈ STB ద్వారా అన్ని OTT యాప్‌లను నేరుగా టీవీలో ఉపయోగించవచ్చు. దీంతో DTH కనెక్షన్ అవసరం లేకుండానే టీవీ ఛానళ్లు, OTT కంటెంట్ రెండింటినీ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్‌లో మరో ప్రత్యేకత JioPC సపోర్ట్. ఇది క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ సేవ. దీని ద్వారా టీవీనే ఒక కంప్యూటర్‌లా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా స్టూడెంట్స్, వర్క్ ఫ్రం హోమ్ వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
దీర్ఘకాలం బ్రాడ్‌బ్యాండ్ సేవను ఒకేసారి తీసుకోవాలనుకునే వారికి 100 Mbps స్పీడ్‌తో పాటు OTTలు, టీవీ ఛానళ్లు, ఉచిత STB వంటి అదనపు ప్రయోజనాలు కోరుకునే వినియోగదారులకు జియో రూ.10,000 మంచి ఎంపిక. ముఖ్యంగా ఇంటర్నెట్, టీవీ, OTT అవసరాలన్నింటినీ ఒకే ప్లాన్‌లో పొందాలనుకునే కుటుంబాలకు ఈ ప్లాన్ ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!