Virat Kohli Anushka: లండన్‌లో ఉన్నా భారత్‌లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Anushka: క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. దేశంలోని ప్రీమియం ప్రాపర్టీలపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్న ఈ సెలబ్రిటీ జంట తాజాగా ముంబైలో మరో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. గత కొంతకాలంగా లండన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయడం లేదని ఈ తాజా డీల్ మరోసారి స్పష్టం చేసింది. ముంబైలోని ప్రముఖ ప్రాంతమైన వెర్సోవాలో 18.29 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను విరాట్, అనుష్క కొనుగోలు చేశారు. సుమారు 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఒక ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో ఉంది. ఈ డీల్‌లో రెండు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. ముంబైలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో వెర్సోవా ఒకటిగా ఉండటంతో ఈ పెట్టుబడి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది ఈ జంట చేసిన తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. ఇప్పటికే వర్లీలో సముద్రానికి దగ్గరగా ఉన్న అత్యంత విలాసవంతమైన నివాసాన్ని వీరు కలిగి ఉన్నారు. అలాగే అలీబాగ్‌లో లగ్జరీ విల్లాను కూడా కొనుగోలు చేశారు. ఈ రెండింటితో పాటు ఇతర ఆస్తులను కూడా కలుపుకుంటే, విరాట్, అనుష్కల రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో విలువ భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ జంట తమ పిల్లలతో కలిసి లండన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై వారి నమ్మకం ఏమాత్రం తగ్గలేదని తాజా కొనుగోలు సూచిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో విరాట్ కోహ్లీ ఎప్పటినుంచో ఆసక్తి చూపుతుండగా, అనుష్క శర్మ కూడా సినిమా ప్రాజెక్టులను తగ్గించిన తర్వాత ఆర్థిక నిర్ణయాలను ఎంతో జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇక వృత్తిపరంగా చూస్తే, విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, వన్డేలు, టీ20లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు, అనుష్క శర్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ, పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ జంట చురుకుగా వ్యవహరిస్తూ తమ ఆస్తులను మాత్రం మరింత పోగేసుకుంటోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..