Elgar Parishad Case: ఎల్గార్ పరిషత్, మావోయిస్టు సంబంధాల కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. అతని బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టుకు తెలిపింది. నవ్లాఖా జాతీయ భద్రత, ఐక్యత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపేలా పలు చర్యలకు పాల్పడ్డారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. నవ్లాఖా బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్ఐఏ న్యాయవాది సందేశ్…
భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరు పాకిస్థాన్‌లో హతమయ్యాడు. సోమవారం సాయంత్రం రావల్పిండిలోని ఓ దుకాణం బయట హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలం హత్యకు గురయ్యాడు.
అన్నాచెల్లెలు మధ్య సెక్స్ గురించి పాకిస్థాన్‌లోని ఓ యూనివర్సిటీ విద్యార్థులను వారి అభిప్రాయాలను అడిగిన నేపథ్యంలో సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు, విద్యార్థి సంఘాలు ఇస్లామాబాద్‌కు చెందిన సీఓఎంఎస్ఏటీఎస్ విశ్వవిద్యాలయం ప్రశ్నాపత్రంలోని ఈ అసభ్యకరమైన కంటెంట్‌ను నిందించారు.
Javed Akhtar: ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ఉగ్రపేలుళ్ల ఘటన గురించి గుర్తు చేస్తూ.. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 26/11 ఉగ్రవాదులు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. భారతీయుల హృదయాలలో చేదు గురించి పాకిస్తాన్లో చేసిన ముక్కుసూటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పురాణ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్‌లో జరిగిన ఉత్సవం కోసం జావేద్…
Pakistan Economic Crisis:రాజకీయ అస్థిరత, తీవ్ర ఆర్థిక సంక్షోభం దాయాది దేశం పాకిస్తాన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఆ దేశ రక్షణ మంత్రి ఏకంగా పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని వ్యాఖ్యానించడం చూస్తే ఆ దేశ పరిస్థితి ఏంటో తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో చర్చలు నిర్వహించింది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఈ ఒప్పందంపై స్పష్టత రాలేదు.
Pakistan Girl : ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. దేశాన్ని దాటుకుని వచ్చి అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తన మతం తెలియకుండా ఉండేందుకు భర్త కోసం తన పేరు కూడా మార్చుకుంది.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి ప్రజలు గోధుమ పిండి, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితుల నుంచి తమను కాపాడాలని ఐఎంఎఫ్ ని అడుగుతోంది. ఇటీవల పదిరోజుల పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాక్ ప్రభుత్వం చర్చలు జరిపింది.
Pakistan: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 40 వేలను దాటింది. ఇదిలా ఉంటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు టర్కీకి భూకంప సాయాన్ని అందిస్తున్నాయి. రెస్క్యూ నుంచి మెడిసిన్స్ వరకు అన్నింటిని సహాయంగా అందిస్తున్నాయి. అయతే టర్కీకి అత్యంత మిత్రదేశం పాకిస్తాన్ కూడా సాయం చేద్దాం అనుకుంది. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్న పాకిస్తాన్ టర్కీకి సాయం చేసి మరోసారి పరువు తీసుకుంది.
పాకిస్తాన్ వాణిజ్య నగరంలో కరాచీలో భారీ ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీస్ కార్యాలయమే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. కరాచీలోని షరియా ఫైసల్ ప్రాంతంలో ఉన్న పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం. కనీసం 8-10 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం కార్యాలయంలో ఉన్నట్లు పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Imran Khan: పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజ్ కోసం తాత్కాలిక ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంపై పాక్ మాజీ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్ (ఆస్పిరిన్)(నొప్పి నుంచి ఉపశమనానికి వాడే ట్యాబ్లెట్)ను వాడతారా..?