Pakistan: పాకిస్తాన్ లో విచిత్రం చోటుచేసుకుంది. కరాచీకి వెళ్దామని విమానం ఎక్కితే, ఏకంగా సదరు వ్యక్తి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో దిగాడు. పాకిస్తాన్ విమానయాన రంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక దేశీయ ప్రయాణికుడి వద్ద వీసా, పాస్పోర్టు లేకుండా సౌదీ వెళ్లే విమానంలోకి ఎలా అనుమతించారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్కు సైనిక మద్దతు ఇచ్చిందా? అనే ప్రశ్నపై చైనా ప్రభుత్వం స్పందించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్కు సైనిక మద్దతు అందించిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని చైనా తన అనేక రక్షణ వ్యవస్థలను పరీక్షించడానికి 'లైవ్ ల్యాబ్'గా ఉపయోగించుకుందని అన్నారు.
Father Abuse on Daughters: ఈ మధ్య ఎక్కడ చూసిన ఎన్నో అఘాయిత్యాలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యలు భర్తలపై చేసే కుట్రలు, ఇంకా మహిళలపై జరిగే దారుణాలు ఎక్కువయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హృదయవిదారక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాకిస్తాన్కు చెందిన ఓ ముస్లిం మహిళ కన్నీటి మధ్య తనపై జరిగిన అసహ్యకరమైన అనుభవాన్ని పంచుకుంది. ఆమె చెప్పిన వివరాలు వింటే మాత్రం ఎవరినైనా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి…
పాకిస్థాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వార్త మరోసారి జాతీయ స్థాయిలో రచ్చ చేస్తోంది. కేరళ రాష్ట్రంలో ఆమెకు రాచమర్యాదలు జరిగినట్లుగా తాజాగా ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.
బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పాకిస్థాన్పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దాయాది దేశం తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం ఉగ్రవాద బాధిత దేశమని.. పాకిస్థాన్ మాత్రం మద్దతుదారుడు అని తెలిపారు.
భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన జైష్-ఎ-మహమ్మద్ సంస్థ నేత మసూద్ అజార్ ఎక్కడున్నాడో తమకు తెలియదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధిపతి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు.
వీధుల్లో తిరిగే గ్రామ సింహాలైన కుక్కలతోనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అవి సృష్టించే బీభత్సాలకు మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఎక్కడొక చోట కుక్కుల దాడిలో చనిపోతున్నారు. అలాంటిది అడవుల్లో ఉండే సింహాలు రోడ్లపైకి వస్తే.. ఇంకేమైనా ఉందా? ఇక ప్రాణాలు పోయినట్టే.
Imran Khan: పాకిస్తాన్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన ఆయన.. ఈ బానిసత్వాన్ని తాను అంగీకరించడానికి బదులు జైల్లో చీకటి గదిలో జీవించడానికి ఇష్టపడతానని రాసుకొచ్చారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఇండోనేషియాలో భారత రక్షణ దళ ప్రతినిధి కెప్టెన్ శివకుమార్ మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభ దశలో భారత వ్యూహాన్ని వివరించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది.