రాహుల్‌గాంధీపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లపై అంశంపై అమిత్‌షా మరోసారి స్పందించారు.
India China: చైనా-పాకిస్తాన్-బంగ్లాదేశ్ కలిసి దుష్ట పన్నాగాన్ని పన్నుతున్నాయి. భారత్‌ని చుట్టుముట్టేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇటీవల ఈ మూడు దేశాలు కలిసి త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. చైనా చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడం భారత్‌కి ఆందోళన కలిగించే విషయం.
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందారు. వాయువ్య పాకిస్థాన్‌లో ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగినట్లగా అధికారులు తెలిపారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వైమానిక దళం, పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్న నేరానికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి, 100 కు పైగా ఉగ్రవాదుల్ని భారత్ హతమార్చింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో పాటు దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని క్షిపణులను ఉపయోగించి భారత్ ధ్వంసం చేసింది. Read Also: DRI: పాకిస్థాన్‌కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ…
SCO Summit: భారతదేశం ఉగ్రవాదంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశంలో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావించకపోవడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు.
Kangana Ranaut: న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన డెమొక్రాటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఓడించి.. విజయం సాధించిన భారతీయ-అమెరికన్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేసింది.
Pakistan Vs India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు- సాయుధ సంఘర్షణ (CAAC)పై వార్షిక బహిరంగ చర్చ సందర్భంగా పాకిస్తాన్‌పై మరోసారి భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనా ముందే పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది.. దాన్ని అరికట్టడానికి సరిహద్దు దాటిన టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడానికి మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పేర్కొన్నారు.
Pakistan: పుల్వామా ఘటనకు బదులుగా భారత్ 2019లో ‘‘బాలాకోట్ వైమానిక దాడులు’’ నిర్వహించింది. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) పైలట్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ -21 బైసన్ విమానంతో అత్యాధునిక అమెరికన్ తయారీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చాడు. అయితే, ఆ సమయంలో అభినందన్ ఫైటర్ జెట్ కూడా కుప్పకూలింది. అయితే, పారాశ్యూట్ సాయంతో ఆయన పాకిస్తాన్ భూభాగంలో దిగడంతో పాక్ ఆర్మీకి చిక్కారు.
Pakistan: పాకిస్తాన్ తన క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ICBM)ను తయారు చేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు తెలిపాయి. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి ఏకంగా అమెరికాను కూడా చేరుకోగలదని నివేదిక చెప్పింది.