పాకిస్థాన్‌లో మరోసారి బాంబ్ దాడితో దద్దరిల్లింది. బలూచిస్థాన్ వెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబును పేల్చారు. రైల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. బలూచిస్థాన్ తిరుగుబాటుదాలు, బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ ఈ దాడికి బాధ్యత వహించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు.. ఖాతాలో రూ.కోటి జమ
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని సింధ్-బలూచిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న సుల్తాన్‌కోట్ ప్రాంతం సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి ఈ రైలును లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. తాజాగా పాక్ ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా ఈ దాడికి పాల్పడింది. ట్రాక్‌లపై అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) వల్ల ఈ పేలుడు సంభవించిందని.. క్వెట్టాకు చెందిన ప్యాసింజర్ రైలు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనలో ఆర్మీ సిబ్బంది చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: CJI Gavai: పశ్చాత్తాపం లేదు.. గవాయ్‌పై నిందితుడు మరోసారి పరుష వ్యాఖ్యలు
ఈ దాడికి బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ బాధ్యత వహించింది. బలూచిస్థాన్ స్వాతంత్ర్యం వచ్చే వరకు ఇటువంటి కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. రెస్క్యూ బృందాలు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.