Nawaz Sharif: నాలుగేళ్ల ప్రవాసం తర్వాత పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగివచ్చారు. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఇస్లామాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి తన కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులోని లాహోర్కి భారీ ర్యాలీ నడుమ వచ్చారు. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశించి ర్యాలీలో ప్రసంగించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో సాధించిన విజయాల గురించి ఆయన ప్రజలకు వివరించారు.
Pakistan: పాకిస్తాన్ ఆప్తమిత్రుడు చైనా ఆ దేశానికి కావాల్సిన అన్ని సాయాలు చేస్తోంది. భారత్‌ని ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్‌కి అన్ని విధాల సహాయపడుతోంది. తాజాగా చైనాకు చెందిన కొన్ని కంపెనీలు పాకిస్తాన్‌కి బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమానికి సంబంధించి కీలక వస్తువులు, సాంకేతికతను సరఫరా చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా, చైనాలోని మూడు కంపెనీలపై ఆంక్షలు విధించింది. గ్లోబల్ నాన్‌ప్రొలిఫరేషన్ రిజిమ్‌లో భాగంగా ఈ మూడు కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ శుక్రవారం తెలిపింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా నిన్న(శుక్రవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాలో ఆసీస్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు విద్యుత్ పోవడంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)పని చేయలేదు. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడింది.
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఆ దేశానికి మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగి వచ్చారు. నాలుగేళ్లుగా యూకేలో అజ్ఞాతవాసంలో ఉన్న నవాజ్ మరోసారి రాజకీయాల్లో యాక్టీవ్ కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా దుబాయ్ లో గడిపిన షరీఫ్, ఈ రోజు అక్కడ నుంచి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి చేరుకున్నారు.
షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ పై భారత మాజీ దిగ్గజం ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. “బెంగళూరులోని ఈ ఫ్లాట్ పిచ్‌పై షాహీన్ 5 వికెట్లు తీయడం గొప్ప అని చెప్పుకొచ్చాడు. కేవలం షాహీన్ తప్ప.. మిగతా బౌలర్లు ఫెయిలయ్యారని విమర్శించాడు. మిగతా నెటిజన్లు కూడా స్పందించారు.
ప్రపంచ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని ఎం చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.
China: చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్ తో మరింతగా సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) కోసం బిలియన్ల కొద్దీ డబ్బును ఖర్చు పెడుతోంది చైనా. ఇక ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు అప్పులు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. భారత్‌ని కౌంటర్ చేయాలంటే ప్రస్తుతం పాకిస్తాన్ తో తన సంబంధాలు బలంగా ఉండాలని చైనా భావిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లోని చైనీయులు ఇటీవల కాలంలో దాడుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీల మోత మోగించారు. డేవిడ్ వార్నర్ 85 బంతుల్లో 100 పరుగులు చేయగా.. మార్ష్ 100 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇక వికెట్ కోల్పోకుండా పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం 32.2 ఓవర్లలో ఆసీస్ స్కోరు 231/0 ఉంది.
పాకిస్తాన్ జట్టు తన నాలుగో మ్యాచ్‌ను ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేసింది. బెంగుళూరులో జరిగిన పేలుడు ఘటనపై పాకిస్తాన్ జట్టు భద్రతపై ఆందోళన చెందాల్సి ఉందని తెలిపింది. మీడియా నివేదికల ప్రకారం.. బెంగుళూరులోని కోరమంగళ ప్రాంతంలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇందులో కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై పాకిస్తాన్ జర్నలిస్టులు నేరుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు…
Pakistan: ఎప్పుడూ లేనంతగా దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ పెట్టే అన్ని షరతులకు తలొగ్గుతోంది. దీంతో ప్రజలపై పన్నులను పెంచింది, ఇది తీవ్ర నిరసనకు దారి తీస్తోంది.