Pakistan: పాకిస్తాన్ కార్ మార్కెట్ ఢమాల్.. దాయాదితో పోలిస్తే భారత్‌లో 100 రెట్లు ఎక్కువ అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఆ దేశం ఉంది. దీనికి తోడు అక్కడ నిత్యావసరాలు, పెట్రోల్, విద్యుత్ ధరలు పెరగడం పాక్ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే గిల్గిట్ బాల్టిస్తాన్, పీఓకేలోని ప్రజలు తాము భారత్ లో కలుస్తామంటూ నిరసనలు చేస్తున్నారు. ఇక రాజకీయ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి పలు కార్ల కంపెనీలు వెళ్లిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కార్లు కొనేవారే కరువయ్యారు. సప్లై చైన్‌లో అంతరాలు, తక్కువ డిమాండ్ వల్ల ప్యాసింజర్ కార్ల పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది.
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
Read Also: Putin: పుతిన్‌ని విమర్శించిన సీనియర్ సైనిక అధికారి మృతి..
ఇండస్ట్రీ బాడీ పాకిస్తాన్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(పీఏఎంఏ) డేటా ప్రకారం, 2023 అక్టోబర్ నెలలో కేవలం 4850 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ నెలలో 6410 యూనిట్ల నుంచి కార్ల అమ్మకాలు 24.34 శాతం తగ్గిపోయాయి. 2022లో అక్టోబర్ నెలలో 11,129 యూనిట్ల కన్నా ఎక్కువ క్షీణత నమోదైంది. పాకిస్తాన్ లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్లలో సుజుకి ఆల్టో, సుజుకి స్విఫ్ట్, సుజుకి బోలన్, సుజుకీ కల్టస్, టయోటా కరోలా, టయోటా యారిస్, హోండా సిటీ, హోండా సివిక్ కార్లు ఉన్నాయి.
మరోవైపు భారత్ మాత్రం ప్రతీ ఏడాది కార్ల అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఇండియా, పాకిస్తాన్ బిజినెస్‌కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. 2023 అక్టోబర్ నెలలో ఇండియాలో సుమారుగా 4 లక్షల కార్లు( 3,91,472) కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 3,36,679 యూనిట్లు విక్రయించారు. భారత్ దేశంలో లక్షల్లో కార్లు అమ్ముడవుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం వేలల్లో కార్లు అమ్ముడవుతున్నాయి.
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?