Pakistan: తాలిబాన్ల వేధింపుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వదిలి పాకిస్తాన్ దేశంలోకి శరణార్థులుగా వెళ్లిన వారి పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్తాన్, తమ దేశం విడిచివెళ్లాలని ఆఫ్ఘన్ శరణార్థులకు డెడ్లైన్ విధించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైడ్స్ నిర్వహించి శరణార్థులను గుర్తిస్తోంది. చాలా ఏళ్లుగా పాకిస్తాన్ లో స్థిరపడిన ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఇళ్లు, వ్యాపారం ఇలా అన్నింటిని వదిలేసి మళ్లీ ఆప్ఘనిస్తాన్ వెళ్తున్నారు.
11 Dead in Karachi Fire Accident: పాకిస్థాన్లోని కరాచీలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రషీద్ మిన్హాస్ రోడ్లోని ఆర్జే షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్లు ఘటనాస్థలికి చేరుకుని ఎంతో శ్రమించి మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదంలో 22 మందిని రక్షించారు. 8 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. Also Read: Rajasthan…
Indian Army: జమ్మూ కాశ్మీర్లోకి విదేశీ ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. రాజౌరీ ఎన్కౌంటర్లో మరణించిన ఐదుగురు ఆర్మీ అధికారులకు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. గత రెండు రోజులుగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరేతోయిబా టాప్ కమాండర్ కారీతో పాటు మరో ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి.
పాకిస్తాన్ వక్రబుద్ధి పోనించుకోవడం లేదు. మొన్నటికి మొన్న మాజీ మిస్ ఇండియా ఐశ్వర్యా రాయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. మరోసారి నోరుపారేసుకున్నాడు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపై విమర్శలు చేశాడు. క్రికెట్ గెలిచిందంటూ ఆయన ట్వీట్ చేశాడు.
Mohammed Shami Fires on Hasan Raza: వన్డే ప్రపంచకప్ 2023లో బీసీసీఐ చీటింగ్ చేస్తోందని, భారత జట్టుకు స్పెషల్ బాల్స్ ఇస్తోందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో భారత్ వరుస విజయాలు చూసి ఓర్వలేని హసన్.. తన అక్కసు వెళ్లగక్కాడు. తాజాగా హసన్ వ్యాఖ్యలపై భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. హసన్ చేసిన వ్యాఖ్యలను చూసి తాను ఆశ్చర్యపోయానన్నాడు. హసన్…
India At UN: సమావేశ అజెండాతో సంబంధం లేకుండా దాయాది దేశం పాకిస్తాన్ ప్రవర్తించడం సాధారణంగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై సమావేశం జరిగినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు పాక్ వైఖరిని భారత్ తూర్పారపట్టింది. అయినా కూడా తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఇప్పటికే చాలా సార్లు ఇది తమ అంతర్గత వ్యవహారమని, భారత్ లో జమ్మూ కాశ్మీర్ భాగంగా ఉంది, ఉంటుంది అని భారత్ ఘాటుగానే స్పందిస్తోంది.
26/11 Mumbai Attacks: 26/11 ముంబై దాడులకు ఈ నెలతో 15 ఏళ్లు కావస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ ‘లష్కరే తోయిబా’ ఉగ్రవాదులు ముంబై నగరంపై దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ ఈ రోజు ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. దీనిని ఘోరమైన ఖండించదగిన సంస్థగా పేర్కొంది. భారతదేశం నుంచి ఎలాంటి అభ్యర్థన లేనప్పటికీ ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Kartarpur Gurdwara: పాకిస్థాన్లోని సిక్కులకు అత్యంత పవిత్రమైన ప్రదేశమైన కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్లో మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు పార్టీని ఏర్పాటు చేసిన ఘటన కలకలం రేపుతోంది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి పలు కార్ల కంపెనీలు వెళ్లిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కార్లు కొనేవారే కరువయ్యారు. సప్లై చైన్లో అంతరాలు, తక్కువ డిమాండ్ వల్ల ప్యాసింజర్ కార్ల పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది.