Pakistan attacks Iran: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ దాడి చేసిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ ఇరాన్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది. గురువారం రోజు ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై పాకిస్తాన్ దాడులు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిజరేషన్ ఆర్మీ వేర్పాటువాద గ్రూపుల పోస్టులపై పాకిస్తాన్ దాడులు చేసినట్లు సమాచారం.
Read Also: Chandigarh Mayor Polls: బీజేపీ-ఇండియా కూటమి తొలిపోరు.. నేడు చండీగఢ్ మేయర్ ఎలక్షన్..
పాకిస్తాన్ నైరుతి బలూచిస్తాన్ లోని జైష్ అల్-అడ్ల్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపై మంగళవారం ఇరాన్ వైమానిక దాడులు చేసింది. దేశభద్రత కోసం తీసుకున్న చర్యగా ఈ దాడిని ఇరాన్ అభివర్ణించింది. అయితే ఈదాడులకు పర్యవసానాలకు ఇరాన్‌దే బాధ్యత అని పాకిస్తాన్ హెచ్చరించిన ఒక రోజు తర్వాత ఇరాన్‌పై దాడులు చేసింది. పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినందుకు తమకు ప్రతిస్పందించే హక్కు ఉందని చెప్పింది. ఉగ్రవాద గ్రూపుగా ఇరాన్ బ్లాక్ లిస్ట్‌లో ఉన్న జైష్ అల్-అడ్ల్ 2012లో ఏర్పడి ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్ గడ్డపై అనేక దాడులకు పాల్పడింది. ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే పాక్ ఇరాన్‌లోని తమ రాయబారిని ఉపసంహరించుకుంది.