పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక ఉన్న కుట్రను కేంద్ర సంస్థలు వెలికితీస్తున్నాయి. 26/11 ముంబై దాడుల కుట్రదారుడు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు ఇక నిర్ధారణకు వచ్చినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
పహల్గామ్ మృతుల కుటుంబాలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సంఘీభావం తెలిపింది. దు:ఖ సమయంలో బాధితులకు అండగా నిలిచింది. ఉగ్రదాడి బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించింది. ఎన్ఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిని పాకిస్థాన్ తప్ప ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండిస్తోంది. ప్రపంచ అగ్ర నేతలంతా ప్రధాని మోడీకి ఫోన్ చేసి సంఘీభావం తెలుపుతున్నారు. అత్యంత ఘోరంగా పహల్గామ్లో మారణహోమం జరిగి కళ్లకు ప్రత్యక్షంగా కనబడుతుంటే.. న్యూయార్క్ టైమ్స్‌కు మాత్రం కళ్లు కనిపించడం లేదు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరుడైన కాన్పూర్ కి చెందిన శుభం ద్వివేది ఇంటికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేరుకున్న విషయం తెలిసిందే. సీఎం రాకతో అక్కడ వాతావరణం చాలా భావోద్వేగంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. ముఖ్యమంత్రిని చూడగానే శుభం భార్య ఐష్ణయ కన్నీరుమున్నీరైంది. వణుకుతున్న స్వరంతో "సార్.. మేము ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం.' అన్నారు.
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రీనగర్, ఉధంపూర్‌లో పర్యటించనున్నారు. కాశ్మీర్ లోయలో మోహరించిన సీనియర్ ఆర్మీ కమాండర్లతో పాటు ఇతర భద్రతా సంస్థల అధికారులను కలవనున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గురువారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది.
అనంత్‌నాగ్ జిల్లా బిజ్బెహారాలోని గోరి ప్రాంతంలో ఉన్న పహల్గామ్ దాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిపై భద్రతా దళాలు బాంబు దాడి చేశాయి. ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గుర్రీగా గుర్తించబడిన ఉగ్రవాది.. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో పాల్గొన్న మరో స్థానిక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ట్రాల్లో ఉన్న ఇంటిని…
హమాస్ అగ్ర నేతలు పాకిస్థాన్‌లో తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. లష్కరే తోయిబాతో కలిసి హమాస్ కలిసి పని చేస్తు్న్నట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ధృవీకరించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్థాన్ దళాలు.. భారత్ పోస్టులపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు తీవ్రంగా తిప్పికొడుతున్నాయి.