పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థానీయులను వివాహం చేసుకున్న చాలా మంది భారతీయ మహిళలు ఇబ్బందుల్లో పడ్డారు. పాకిస్థానీ వ్యక్తులను పెళ్లి చేసుకున్న హిందుస్థానీ మహిళలు.. భారత్‌లోని తమ ఇళ్లను విడిచిపెట్టి అత్తమామల ఇళ్లకు(పాక్) వెళ్లడానికి సిద్ధమయ్యారు. అలాంటి అనేక మంది మహిళలను అట్టారి-వాఘా సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ దళాలు నిలిపి వేశాయి. బీఎస్ఎఫ్ ప్రకారం.. పాకిస్థానీయులు దేశం దాడి వెళ్లేందుకు ప్రభుత్వం 48 గంటల కాలపరిమితిని ఇచ్చింది. ఇందులో దాదాపు 287 మంది పాకిస్థానీ…
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఖైబర్-పఖ్తుంఖ్వాలోని కాకుల్‌లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగించారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. 48 గంటల్లో ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే మానవతా దృక్పథంతో వైద్య, దౌత్య మరియు దీర్ఘకాలిక వర్గాలకు కొంత మినహాయించింది. తాజాగా వారికి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.
పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు.
యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. పహల్గామ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి వరుసగా రెండో రోజు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ సైన్యం ఎల్ఓసీ వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం అప్రమత్తమై.. కాల్పులను తిప్పికొట్టింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది.
Iran: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ పాక్‌కి వ్యతిరేకంగా దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జల ఒప్పందం’’ని రద్దు చేసింది. సింధు, దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు పాక్‌కి వెళ్లకుండా ప్రణాళికలు రచిస్తోంది.
Tulsi Gabbard: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర ఘటనపై యావత్ ప్రపంచం భారత్‌కి అండగా నిలుస్తుంది. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టులను కిరాతకంగా కాల్చి చంపారు. మతం ఆధారంగా, హిందువుల్ని టార్గెట్ చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే, ప్రపంచ దేశాల నాయకులు, ప్రధాని మోడీకి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ఉగ్రవాద అణిచివేతలో తాము భారత్‌కి అండగా నిలబడుతామని చెప్పారు.
Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అయినప్పటికీ, ఈ దాడి గురించి పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన ఖండన రాలేదు. దీనికి తోడు, భారత్ దాడి చేస్తే ప్రతిదాడి ఎలా చేయాలనే దానిపైనే దాయాది దేశం చూపు ఉంది. ఆ దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులకు పాల్పడినట్లు తెలిసినా కూడా తమ వారు కాదని ఇంకా బుకాయిస్తోంది.