ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రీనగర్, ఉధంపూర్‌లో పర్యటించనున్నారు. కాశ్మీర్ లోయలో మోహరించిన సీనియర్ ఆర్మీ కమాండర్లతో పాటు ఇతర భద్రతా సంస్థల అధికారులను కలవనున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గురువారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది.
అనంత్‌నాగ్ జిల్లా బిజ్బెహారాలోని గోరి ప్రాంతంలో ఉన్న పహల్గామ్ దాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిపై భద్రతా దళాలు బాంబు దాడి చేశాయి. ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గుర్రీగా గుర్తించబడిన ఉగ్రవాది.. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో పాల్గొన్న మరో స్థానిక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ట్రాల్లో ఉన్న ఇంటిని…
హమాస్ అగ్ర నేతలు పాకిస్థాన్‌లో తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. లష్కరే తోయిబాతో కలిసి హమాస్ కలిసి పని చేస్తు్న్నట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ధృవీకరించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్థాన్ దళాలు.. భారత్ పోస్టులపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు తీవ్రంగా తిప్పికొడుతున్నాయి.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్‌కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి…
Ceasefire: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Indian Airlines: పహల్గామ్ ఉగ్ర దాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం కూడా ఇప్పటికే దౌత్య చర్యల్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు, పాకిస్థానీలకు వీసాల రద్దు, సరిహద్దు మూసివేత వంటి నిర్ణయాలను ప్రకటించింది. అయితే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్‌తో వాణిజ్యం రద్దు చేయడంతో పాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేసినట్లు ప్రకటించింది.…
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నుంచి భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్‌ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(LeT)తో సంబంధం ఉన్న ముగ్గరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరాలోని చెక్‌పాయింట్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. గరూరా హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదుల నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక చైనీస్ పిస్టల్,…
Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ లోలోపల భయపడుతూనే, భారత ప్రతీకారాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ తన సైన్యాన్ని మోహరించింది. ఈ రోజు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ నేతృత్వంలో హై లెవల మీటింగ్ జరిగింది. దీని తర్వాత, భారత్‌పై ప్రతీకార చర్యలకు పాల్పడింది. భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేయడంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేస్తున్నట్లు, వాణిజ్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.