Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామనే సందేశాన్ని పంపడానికి శుక్రవారం ప్రార్థనలకు వెళ్లేటప్పుడు ముస్లింలు తమ్ చేతులకు నల్ల బ్యాండ్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయక పౌరులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన నేపథ్యంలో దేశ రాజకీయ వర్గాలన్నీ భద్రతా అంశంపై ఒక్కటై చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నేడు (గురువారం) న్యూ ఢిల్లీలో ఒక అత్యంత కీలకమైన అఖిలపక్ష సమావేశం జరిగింది. దేశ భద్రతకు సంబంధించి ఈ సున్నితమైన అంశంపై చర్చించేందుకు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య…
Netanyahu: ప్రధాని నరేంద్రమోడీకి, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడికి పాల్పడిన టెర్రరిస్టుల్ని, వారి మద్దతుదారుల్ని న్యాయం ముందు నిలబెట్టాలనే భారతదేశ దృఢ సంకల్పానికి ఇజ్రాయిల్ మద్దతుగా నిలిచింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా -2 కూడా ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, భారత దేశానికి మద్దతుగా…
Indian Air Force: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘టీఆర్ఎఫ్’’ ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది టూరిస్టుల మరణించారు. దీంతో ప్రజలు పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Amit Shah: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడిపై యావత్ దేశం తన ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్‌కి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ ఉగ్రవాద దాడి గురించి గురువారం వీరిద్దరు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతికి వివరించారు. Read Also: Surya…
Pakistan: పాకిస్తాన్ భారత్‌తో యుద్ధానికి దిగేందుకే ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి’’కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక దేశాన్ని, దేశ ప్రజల్ని ఏకం చేయాలంటే ‘‘యుద్ధం’’ని మించిన మార్గం లేదని పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్‌తో చిన్న పాటి ఘర్షణను కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఇటీవల కాలంలో ఆసిమ్ మునీర్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. బెలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), పాక్ తాలిబాన్లు పచ్చడిపచ్చడి చేస్తున్నాయి.…
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల చనిపోయి, యావత్ భారతదేశం దు:ఖంతో ఉంటే, మరికొందరు మాత్రం ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ తన చర్యల్ని వేగవంతం చేసింది. పాకిస్తాన్ తీరును ఎండగట్టడానికి, టెర్రరిస్టుల దాడి గురించి వివరించడానికి ప్రపంచ దౌత్యవేత్తలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే, భారత్ ఉగ్రదాడి గురించి అమెరికా, యూరోపియన్ దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సమావేశానికి జపాన్, ఖతార్, చైనా, కెనడా మరియు రష్యా నుండి దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు.
ప్రధాని మోడీని విమర్శించడానికి ఎలాంటి అవకాశం ఉన్నా వదులుకోని నటుడు ప్రకాష్ రాజ్ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి విషయంలో మౌనం పాటించారు. ఆయన స్పందించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపించిన క్రమంలో ఒక కాశ్మీరీ వ్యక్తి సందేశం అంటూ ఒక మెసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్‌పై జరిగిన దాడి అని ఆయన షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ…
BSF jawan: అంతర్జాతీయ సరిహద్దు (IB)ని అనుకోకుండా దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్ని పాకిస్తాన్ తన అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన బుధవారం రోజున జరిగింది. 182వ BSF బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ PK సింగ్ అనుకోకుండా సరిహద్దు దాటాడు. ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో, సాధారణ కదలికల్లో భాగంగా, సింగ్ అనుకోకుండా సరిహద్దు కంచెను దాటి పాకిస్తాన్ వైపు ప్రవేశించాడు.