Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్‌ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ఉగ్రవాదులు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం ఉదయం పర్యాటకులు బైసారన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహెల్గావ్లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ఒకరు మరణించినట్లు సమాచారం. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకుని, కూంబింగ్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నారు.