పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. తక్షణమే భారత్‌ను విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి.. పాకిస్థానీయులను పంపేయాలని ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే పోలీసులు.. జల్లెడ పడుతున్నారు.
తాజాగా సీమా హైదర్ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేంద్రం ఆదేశాలతో సీమా హైదర్ కూడా పాకిస్థాన్ వెళ్లిపోవల్సి ఉంటుంది. 48 గంటల్లో భారత్‌ను ఖాళీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్ పౌరురాలైన సీమా హైదర్ భవితవ్యం ప్రమాదంలో పడింది. ఇటీవలే ఆమె ఆడబిడ్డకు జన్మినిచ్చింది. ప్రియుడితో కలిసి ప్రస్తుతం ఢిల్లీ సమీపంలో నివాసం ఉంటోంది. కేంద్రం ఆదేశాలతో ఆమె వెళ్తుందా? వెళ్దా? అన్న అంశంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆమెను పంపేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తు్న్నారు.
2023లో ప్రియుడి సచిన్ మీనా కోసం పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చేసింది. అనంతరం భర్త సచిన్ మీనాతో కలిసి ఢిల్లీలో ఉంటోంది. పబ్‌జీ ఆడుతూ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్రం పాక్ పౌరుల వీసాలు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సీమా హైదర్ భవితవ్యం ఏంటి? అని ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ఆమెకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఉపశమనం లభించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Vinay Narwal: పహల్గామ్ బాధితుడు నేవీ ఆఫీసర్ భార్యపై నీచంగా ట్రోలింగ్.. ఒకరు అరెస్ట్