పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ముక్తకంఠంతో నినదిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్యపరమైన దాడికి తెరలేపింది. దేశం మొత్తం పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. ముష్కరుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్గౌడ్, ఒవైసీ, మంత్రులు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్,…
Indus water: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్‌కి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు, దాని ఉపనదులు నుంచి ఒక్క చుక్క నీరు దక్కకుండా భారత్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఇది ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించింది. సింధు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నిర్ణయాన్ని భారత్, పాక్ ప్రభుత్వానికి అందించింది.
Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సింధు నది జలాల ఒప్పందం రద్దు గురించి ఉగ్రవాది మాట్లాడిన వీడియోని ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కావాలని వైరల్ చేస్తోంది.
పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై దౌత్య దాడికి పూనుకుంది. సిందూ జలాల ఒప్పందం, వీసాల రద్దు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలర్ట్ చేసింది. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించాలని కేంద్రం ఆదేశించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాదులో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించింది. Also Read:Realme 14T 5G: 6.67-అంగుళాల…
RSS chief: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారతదేశం ఆగ్రహంతో ఉంది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. ముఖ్యంగా, మతం ఆధారంగా ఉగ్రవాదులు హిందువుల్ని టార్గెట్ చేసి మరీ చంపారు. కల్మా చదవమని, చదవని వారిని వెతికి మరీ పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. హిందువులను ఊచకోత కోశారు.
Simla Agreement: పహల్గామ్ ఉగ్రదాడి, ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ -పాక్ మధ్య 1972లో ‘‘సిమ్లా ఒప్పందం’’ జరిగిన చారిత్రాత్మక టేబుల్‌పై ‘‘పాకిస్తాన్ జెండా’’ కనిపించకుండా పోయింది. భారత్, పాక్‌తో సంబంధాలను నిలిపేసిన ఒక రోజు తర్వాత ఈ విషయం జరిగింది. మంగళవారం, పహల్గామ్లో 26 మంది అమాయకపు టూరిస్టులను లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ కిరాతకంగా చంపేసింది.
Kerala: పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై యావత్ దేశం బాధపడుతుంటే, మరికొందరు మాత్రం ఈ ఘటనపై వివాదాస్పద కామెంట్స్, సోషల్ మీడియా పోస్టు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇలాంటి సమయంలో సంయమనం, సంఘీభావం ప్రకటించాల్సింది పోయి, కొందరు తెలివి తక్కువ రాజకీయ నాయకులు రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారు.
Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ క్రూరంగా కాల్చి చంపింది. ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే, బలూచిస్తాన్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే, బలూచ్ ప్రజలు తమకు స్వాతంత్య్రం కావాలని నినదిస్తున్నారు. ఇందుకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ సైనికులు, అధికారులే టార్గెట్‌గా దాడులకు…
ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇరు దేశాల బలాబలాలు, ఏ దేశం ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన సైన్యాలను లిస్ట్ చేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ -2025 ప్రకారం, చూస్తే అన్ని విభాగాల్లో పాకిస్తాన్‌కి అంతనంత ఎత్తులో భారత్ ఉంది.
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనుపెట్టుకున్నారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన వారిని, మతం అడిగి హిందువులు అయితే కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది.