కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వెంటనే పంపించేయాలని ఆదేశించారు. ఇప్పటికే పాకిస్థాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. దీంతో చాలా మంది అటారీ-వాఘా సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమిత్ షా ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అధికారులు.. పాకిస్థానీయుల కోసం జల్లెడ పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Vinay Narwal: పహల్గామ్ బాధితుడు నేవీ ఆఫీసర్ భార్యపై నీచంగా ట్రోలింగ్.. ఒకరు అరెస్ట్
మంగళవారం పహల్గామ్‌లో ఉగ్రమూకల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఈ ఘటనలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. పాకిస్థాన్‌పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ-వాఘా సరిహద్దును మూసేసింది.
ఇది కూడా చదవండి: Khawaja Asif: ’30 ఏళ్లుగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాం’.. నిజం ఒప్పుకున్న పాక్ రక్షణ మంత్రి…