పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరిచి ప్రధానమంత్రిని కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాయాది దేశంతో యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని విలువలకు తిలోదకాలిచ్చింది. పాకిస్తాన్, ఉగ్రవాదులు మాట్లాడుతున్న భాషలో.. మాట్లాడుతోంది. పాకిస్తాన్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచన ఒకే రకంగా ఉందని అర్థమవుతోందన్నారు. Also Read:Pahalgam Terror Attack: పహల్గామ్…
Pak Hackers: 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, భారతీయ సైట్లపై పాకిస్తాన్ హ్యాకర్ల దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. మంగళవారం, శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(APS), APS రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (AWHO) డేటాబేస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్‌ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. "IOK హ్యాకర్"గా పనిచేస్తున్న హ్యాకర్లు ఈ వెబ్సైట్లను డీఫేస్ చేయడానికి ప్రయత్నించారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి అనేక వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. టూరిస్టులు రీల్స్ చేస్తున్న సమయంలో కొందరి మొబైల్లో ముష్కరుల దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తాజాగా, జిప్ లైనర్‌పై వెళ్తున్న ఓ టూరిస్ట్ రికార్డ్ చేసిన వీడియోలో కూడా టెర్రరిస్టుల దాడి రికార్డ్ అయింది. అయితే, దీనికి ముందు జిప్ లైన్ ఆపరేటర్ చేసిన ‘‘ అల్లాహు అక్బర్’’ నినాదాలు సంచలనంగా మారాయి. ఆపరేటర్ ముజమ్మిల్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
BJP vs Congress: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ..‘‘అవసరమైన సమయాల్లో మిస్ అవుతారు’’ అని కామెంట్ చేసింది. ప్రధానిని సూచించే ఒక ఫోటోని పోస్ట్ చేసి, దానికి తల లేకుండా ఉంచింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pahalgam terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే, టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో ఉగ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి మార్గం లేకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేట్ నుంచి రాగా, ఒకరు ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చారు. నాలుగో ఉగ్రవాది వీరికి సపోర్ట్ చేయడానికి అడవిలో దాగి ఉండొచ్చని దర్యాప్తు…
India Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచింది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని లష్కరే తోయిబా ఫ్రాక్సీ ‘‘ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు కాల్చి చంపారు. మతం ఆధారంగా మారణహోమానికి పాల్పడ్డారు. అయితే, ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. దాడిలో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఇప్పటికే, భారత్ పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. పాక్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు…
India Pakistan: పాకిస్తాన్‌పై భారత్ మరింత ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఇప్పటికే భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేసింది. అట్టారీ-వాఘా బోర్డర్‌ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్‌కి బిగ్ షాక్ ఇవ్వడానికి భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఉగ్ర దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి (ఎల్ఓసీ) పాకిస్థాన్ వరుస కాల్పులకు తెగబడుతోంది. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుంటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.. ఇక, మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్..
పహల్గామ్ దాడి తరహాలో మరిన్ని దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత తర్వాత జమ్మూకాశ్మీర్‌లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి.