India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కి భారత్ షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా దెబ్బతీసింది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై అణిచివేత చర్యలు చేపట్టింది.
Shahid Afridi: షాహిద్ అఫ్రీది..క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు ఉండరు. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌కి చాలా ఏళ్లు క్రికెట్ ఆడాడు. అయితే, పలు సందర్భాల్లో భారత్ అన్నా, హిందువులు అన్నా ద్వేష భావం అతడిలో కనిపిస్తుంటుంది. తాజాగా, పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఉగ్రవాదాన్ని సమర్థించాడు. ఈ నేపథ్యంలో అతడి యూట్యూబ్ ఛానెల్‌ని కేంద్రం బ్యాన్ చేసింది.
Supreme Court: జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ ఘటనకు పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది.
Shahid Afridi: 26 మందిని బలి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. లష్కరే తోయిబా ప్రాక్సీ ఉగ్రసంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఇప్పటికే భారత్ దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఈ చర్యతో పాకిస్తాన్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పాక్ 80 శాతం ప్రజలు ఈ సింధు, దాని ఉపనదులపైనే…
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంగళవారం జరిగిన అత్యున్నత భేటీలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతీకారం కోసం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బుధవారం కూడా ప్రధాని వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే, భారత్ సైనిక చర్యకు ప్లాన్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, భారత్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తుందో అని దాయాది దేశం పాకిస్తాన్ హడలి…
India warns Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే, ఎలాంటి కవ్వింపులు లేకుండానే పాకిస్తాన్ కాల్పు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పదే పదే జరుగుతున్న కాల్పుల ఉల్లంఘనపై భారత్ పాకిస్తాన్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్(డీజీఎంఓలు) మంగళవారం హాట్లైన్లో భారత్ పాకిస్తాన్‌ని హెచ్చరించింది. మంగళవారం ఉదయం వరకు కాల్పుల…
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్‌ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. తటస్థ, పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది.
Pakistan: 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే దౌత్యపరంగా భారత్ పాకిస్తాన్‌కి షాక్‌లు ఇస్తోంది. పాక్ ప్రాణాధారమైన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసి, దేశంలో ఉంటున్న పాకిస్థానీలను వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌పై చర్యల విషయంలో భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. టైమ్,…
PM Modi: మే 9న రష్యా రాజధాని మాస్కోలో జరిగి రష్యా ‘‘విక్టరీ డే’’ వేడులకు ప్రధాని నరేంద్రమోడీ గైర్హాజరు అవుతున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ హాజరుకావడం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి బుధవారం రాయిటర్స్‌తో చెప్పారు. ప్రధాని మోడీ నిర్ణయం వెనక కారణాలను రష్యన్ అధికారులు పేర్కొననప్పటికీ, పహల్గామ్ దాడి నేపథ్యంలోనే ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే ప్రాక్సీ అయిన ‘‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులే. పహల్గామ్ దాడి తర్వాత భారత టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీస్ సయీద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతడికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు తెలుస్తోంది.