పహల్గామ్ ఉగ్ర దాడిపై పాకిస్థా్న్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రాణ నష్టం జరగడం విషాదకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు మంగళవారం ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాజా ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Pakistan: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది.. ధీటుగా ఎదుర్కొంటామన్న పాక్ మంత్రి
పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా పాకిస్థాన్‌పై భారత్ నిందలు వేసిందని.. ఇప్పుడు కూడా అదే మాదిరిగా మోడీ సర్కార్ నిందలు వేస్తోందని తెలిపారు. తన హయాంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినా భారత్‌కు ముందుకు రాలేదన్నారు. 2019లో జరిగినట్లుగానే.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ భారత్ దుస్సాహసానికి దిగితే.. అందుకు పాకిస్థాన్ కూడా అణు ఘర్షణతో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య చెలగాటం ఆడకుండా బాధ్యతాయుతంగా భారత్ వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
శాంతినే మా ప్రాధాన్యత అన్నారు. దాన్ని పిరికితనం అని తప్పుగా భావించకూడదన్నారు. ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీలపై విమర్శలు గుప్పించారు. స్వార్థపరులైన వ్యక్తలు నుంచి మంచిని ఆశించడం అమాయకత్వం అన్నారు. వారి అక్రమ సంపదన.. వ్యాపార ప్రయోజనాలు విదేశాల్లో ఉన్నందున వారు భారతదేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడరన్నారు. అందుకే వారంతా ప్రస్తుతం మౌనంగా ఉన్నారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. 2023 నుంచి వివిధ కేసుల్లో జైల్లో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Kolkata: హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం, 14 మంది మృతి
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలు పాలయ్యారు. అనంతరం పాకిస్థా్న్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది. పాక్ యూట్యూబ్ ఛానళ్లు నిలిపివేసింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
“Loss of human life in Pahlgam incident is deeply disturbing and tragic. I extend my deepest condolences to the victims and their families.
When the False Flag Palwama Operation incident happened, we offered to extend all-out cooperation to India but India failed to produce any…
— Imran Khan (@ImranKhanPTI) April 29, 2025