PM Modi: మోడీ సంచలన నిర్ణయం.. రంగంలోకి త్రివిధ దళాలు..
- పహల్గామ్ దాడికి ప్రతీకారానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ..
- సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ..
- టార్గెట్ ప్లేస్, టైమ్ అన్ని నిర్ణయాలు సైన్యం చేతిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని మోడీ ఆదేశించారు.
90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
Also Read
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
Read Also: Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్
భారత సాయుధ దళాల సామర్థ్యాలపై ప్రధాని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైన్యమే టార్గెట్ ప్లేస్, టైమ్ చూసి జవాబు ఇచ్చేలా త్రివిధ దళాలకు ‘‘పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ’’ను ఇచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని నేతృత్వంలో జరిగిన రెండో అత్యున్నత సమావేశం ఇదే. అంతకు కొన్ని రోజుల ముందు ‘‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’ సమావేశమైంది. తాజాగా, ఈ రోజు త్రివిధ దళాలుతో మోడీ సమావేశం కావడం గమనార్హం.
ఇప్పటికే పాకిస్తాన్‌పై భారత్ దౌత్య యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ 80 శాతం జనాభాకు జీవనాడి అయిన ‘‘సింధు నది’’కి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’రద్దు చేసింది. దీంతో పాటు పాక్ జాతీయుల వీసాలను రద్దు చేసి, దేశం వదిలి వెళ్లాలని డెడ్‌లైన్ విధించింది. అట్టారీ-వాఘా బోర్డర్‌ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇప్పుడు మిలిటరీ యాక్షన్‌కి కూడా ప్రధాని మోడీ పర్మిషన్ ఇవ్వడం సంచలనంగా మారింది. మిలిటరీ యాక్షన్ తీసుకుంటారా..?, లేక పూర్తి స్థాయి యుద్ధానికి జరుగుతుందా..? అనేది ప్రజల్లో ఆసక్తి ఉంది.
తాజావార్తలు
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!